
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి వీరాభిమాని హీరో నితిన్ (Nithiin)అనే సంగతి తెలిసిందే. అనేక సార్లు స్టేజి మీద కూడా ఆయన ఈ విషయం చెప్పారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్స్ సైతం రీమిక్స్ చేసారు. నితిన్ సూపర్ హిట్ 'గుండెజారి గల్లంతయ్యిందే'లో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా 'తొలిప్రేమ'లో 'ఏమైందో ఈ వేళ' పాటను రీమిక్స్ చేశారు. నితిన్ ఈవెంట్స్ కి పవన్ కూడా గెస్టుగా వచ్చారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అలాగే తన కొత్త సినిమాకి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ పెట్టుకుని తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటి..
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్(Vakeel Saab) తో హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో నితిన్ నెక్స్ట్ సినిమా ప్రారంభించారు. ఈ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘తమ్ముడు’ అని ఫైనల్ చేసారు. ఈ రోజు ఈ చిత్రం ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు నిర్మించనున్న చిత్రమిది. ఆ సంస్థలో 56వ చిత్రమిది. ఈ నేపధ్యంలో నితిన్ ఈ విషయం తెలియ చేస్తూ ట్వీట్ చేసారు.
కొన్ని టైటిల్స్ రెస్పాన్సిబిలిటితో కూడా అటాచ్ అయి ఉంటాయి. మీ అంచనాలని నేను ఈ సినిమాతో అందుకుంటాను అని ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ టైటిల్ తన సినిమాకు పెట్టుకోవడం చాలా బాధ్యతతో కూడిన విషయమని ఆయన మాటల్లో వ్యక్తం అయ్యింది. దీంతో నితిన్ కొత్త సినిమా అనౌన్స్ వైరల్ మారింది. పవన్ టైటిల్ తో సినిమా తీస్తుండటంతో నితిన్ ఫ్యాన్స్ తో పాటు పవన్ అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.