
జైలర్ సక్సెస్ తో దీమ్ అంతా దిల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా ఈమూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ను చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు టీమ్. సూపర్ స్టార్ రజినీకాంత్ కేక్ కట్ చేయగా.. రమ్యకృష్ణతో పాటు.. పలువురు ఈ పార్టీలో సందడి చేశారు.
జైలర్ రిలీజ్ టైమ్ లో హిమాలయాల్లో ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. తన ప్రతీ సినిమా రిలీజ్ కు పక్కాగా ఆయన అక్కడికి వెళ్తారు. ఇక అక్కడి నుంచి ఉత్తర భారతదేశంలో ప్రముఖ దేవాలయాలు, ఆశ్రమాలు.. ప్రముఖ నాయకులు.. తన ఆత్మీయులను కలుసుకుంటూ.. రీసెంట్ గానే చెన్నై చేరారు తలైవార్. ఇక ఈలోపు తన జైలర్ సినిమా రికార్డ్ లు సృష్టించడం..తో పాటు... ఓవర్ ఆల్ గా 550 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచాడు రజనీకాంత్. శుక్రవారం రాత్రి జరిగిన ఈ పార్టీలో సూపర్ స్టార్ రజనీకాంత్, అనిరుధ్, నెల్సన్, రమ్యకృష్ణ సహ జైలర్ టీమ్‌లోని ముఖ్యులంతా ఈ పార్టీలో సందడి చేశారు.
జైలర్ బ్లాక్‌బస్టర్ అవ్వడంపట్ల తలైవకు అందరూ కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఈ సినిమాలో నటించిన తమన్నా, వసంత్ రవి, యోగిబాబు మాత్రం ఈ వేడుకల్లో కనిపించలేదు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో ..రమ్య కృష్ణ ఆయన భార్యగా నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్ . తమన్నా అద్భుతమైన సాంగ్ తో పాటు.. ఓ గ్లామర్ రోల్ లో ఆకట్టుకుంది. వీరితో పాటు మరికొంత మంది స్టార్ సీనియర్ నటీనటులు ఈసినిమాలో సందడి చేశారు.
అన్ని భాషల్లో ఈమూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది. తమిళంలో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఈసినిమా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా దుమ్మురేపింది. సౌత్ లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను చూడటానికి రజినీ ఫ్యాన్స్ జపాన్ నుంచి చెన్నై వచ్చారంటే.. ఈమూవీ క్రేజ్ అర్ధం అవుతోంది. సుభాస్కరన్ జైలర్ ను నిర్మించగా... ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందీ జైలర్.
ఇక ఈమూవీలో మరో విశేషం ఏంటీ అంటే.. చుట్టుపక్కల రాష్ట్రాల అభిమానులను.. రజినీకాంత్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. తలైవాకు తోడుగా మరికొంత ఇమేజ్ ను యాడ్ చేశాడు దర్శకుడు. అతిధి పాత్రల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమర్ ను, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాన్ ను.. హిందీ నుంచి దాదా జాకీష్రాఫ్ ను రంగంలోకి దింపాడు. తెలుగు నుంచి బాలయ్య బాబును తీసుకోవాలి అని అనుకున్నా.. కొన్నికారణాల వల్ల కుదరలేదని తెలుస్తోంది. ఇక తెలుగు నుంచి ఈసినిమాలో కమెడియన్ సునిల్ కు మంచి పాత్ర లభించింది.