థాయ్ లాండ్ చేరిన ఓజీ.. భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన సుజిత్, పవర్ స్టార్ బర్త్ డేకు భారీ ట్రీట్..?

Published : Aug 27, 2023, 08:38 AM IST
థాయ్ లాండ్ చేరిన ఓజీ.. భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన సుజిత్,  పవర్ స్టార్ బర్త్ డేకు భారీ ట్రీట్..?

సారాంశం

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ బర్త్ డేకు భారీ ట్రీట్ ను ప్లాన్ చేశాడట డైరెక్టర్ సుజిత్. ప్రస్తుతం ఫ్యాన్స్ ఉత్కంటగా ఎదురుచూస్తున్నారు ఓజీ అప్ డేట్ కోసం. కాని సుజిత్ టీమ్ మాత్రం భారీ షెడ్యుల్ కోసం థాయిలాండ్ చేరింది..? 


పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌  హీరోగా భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. ఓజీ.  ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ టైటిల్ తో సాహో ఫేమ్  సుజిత్‌ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను . డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న  ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ స్టెైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. 

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఓజీ.  అటు హరిహరవీరమల్లు.. ఉస్తాద్ సినిమాలపై దాదాపు హోప్స్ వదిలేసుకున్నారు ఫ్యాన్స్.. అవి ఇక ఎలక్షన్స్ తరువాతే వస్తాయోమే అన్న అభిప్రయాయానికి వచ్చేసారు. ఒక వేళ ఈలోపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు అయినా పవర్ టైమ్ ఇవ్వగలడేమో కాని.. హరిహర వీరమల్లుపై ఎటువంటి ఆలోచన లేదంటు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అందరి చూపు ఓటీవైపే ఉంది. పవర్ ను స్టైలీష్ గ్యాంగ్ స్టార్ గా సుజిత్ సరికొత్త పవర్ ను చూపించబోతున్నాడట. ఈ విషయంలో ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. 

ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓజీ  భారీ షెడ్యూల్‌ను థాయ్‌లాండ్‌, బ్యాంకాక్‌లో తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ షెడ్యూల్ కోసం మూవీ టీమ్  థాయ్‌లాండ్‌కు వెళ్లిందని, అక్కడ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ సంగతి అలా ఉంచితే.. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా మంచి ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కు డైరెక్టర్ సుజిత్ ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ నిరాశచెందుకుండా సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు.

 సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ బర్త్ డే ను సెలబ్రేట్ చేస్తూ.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడట సుజిత్. ఈ సినిమాలో పవర్ కళ్యాణ్ ఎలా ఉండబోతున్నాడో  చూపిస్తూ.. ఓటీజర్ ను బర్త్ డే గిఫ్ట్ గా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.  ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇమ్రాన్‌ హష్మీ, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ ఈసినిమాకు తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం