నిఖిల్ సినిమా ఆగిపోయినట్లే..!

Published : Jun 26, 2019, 03:15 PM IST
నిఖిల్ సినిమా ఆగిపోయినట్లే..!

సారాంశం

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా జోరుమీదున్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా జోరుమీదున్నాడు. 'స్వామిరారా', 'కార్తికేయ', 'ఎక్కడకి పోతావు చిన్నవాడ' వంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ హీరో గతేడాది 'కిరాక్ పార్టీ' సినిమాతో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు.

కానీ ఆశించిన స్థాయిలో సినిమా ఆడలేదు. ఇక నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం'  సినిమా షూటింగ్ పూర్తై ఇంతకాలమవుతున్నా విడుదలకు నోచుకోవడంలేదు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూనే ఉంది. ఇది ఇలా ఉండగా.. నిఖిల్ 'శ్వాస' అనే సినిమాను మొదలుపెట్టాడు.

సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశాడు. ఈ సినిమాతో కిషన్ కట్టాదర్శకుడిగా పరిచయం కావాల్సివుంది. సినిమా షూటింగ్ కూడా సగం పూర్తయింది. కానీ మధ్యలోనే సినిమా ఆగిపోయిందని సమాచారం. సినిమా అవుట్ పుట్ సరిగ్గా రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడట నిఖిల్. సినిమా షూటింగ్ ఆపేసి చాలా రోజులైందని ఇక మొదలుకాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే రీషూట్ చేస్తారా..? లేక కంప్లీట్ గా సినిమాను పక్కన పెట్టేస్తారా..? అనే విషయంలో స్పష్టత లేదు. మరోపక్క నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాను పట్టాలెక్కించడానికి  సిద్ధమవుతున్నాడు. 'కార్తికేయ' సినిమాను డైరెక్ట్ చేసిన చందు మొండేటి సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?