
రావణాసుర సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుండటంతో మాస్ మహారాజ్ రవితేజ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. సుధీర్ వర్మతో కలిసి రవితేజ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రావణాసుర టీజర్, ఆంథెమ్ సాంగ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది రావణాసుర. ఇక ప్రమోషన్స్ లో భాగంగా...రవితేజ తనదర్శకుడు సుధీర్ వర్మతో కలిసి బోన్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. రవితేజ, సుధీర్ వర్మ లను బోనులో పెట్టి విచారిస్తోంది యాంకర్ సుమ.
అవును ఇందంత సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరుగుతుంది. మూవీ టీమ్ ను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేస్తుండగా.. కాస్త డిఫరెంట్ గా ఈ ఇంటర్వ్యూను ప్లాన్ చేశారు. రొటీన్ కు భిన్నంగా.. బోనులో ఇద్దరిని నిల్చోబెట్టి.. రావణాసుర సినిమాలో జరిగే క్రైం గురించి విచారిస్తుందా..? లేదంటే వేరే విషయాలపై ఆరా తీస్తుందా..? అనేది తెలియాలంటే ఇంటర్వ్యూ చూడాల్సిందే. అది రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. రవితేజ, సుధీర్ వర్మ టీం ఇప్పటికే ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంది. రావణాసుర ప్రమోషనల్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇక ఈ మూవీలో రవితేజ సరసన ఈ సినిమాలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అంతే కాదు రావణాసురలో అక్కినేనీ హీరో సుశాంత్ మాస్ మహారాజ్ కు విలన్‌గా నటిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై ఈసినిమా సంయుక్తంగా తెరకెక్కుతుంది. రావణాసురలో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ. గెలుపు ఓటమీ అనేది పట్టిచుకోకుండా సినిమాలు తెరకెక్కితున్నాడు. అయితే వరుస ఫెయిల్యూర్స్.. లేకుంటే వరుస హిట్లు సాధిస్తూ.. ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన రవితేజాకు ధమాకాతో మరో హిట్ లభించింది. ఇక రావణాసుర హిట్ తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం ప్రమోషన్లు జోరు చూపిస్తున్నాడు.