Nikhil Karthikeya2 Shooting: ఫారెన్ షూట్ లో నిఖిల్ కార్తికేయ2, అప్డేట్ కు రెడీ అవుతున్న యంగ్ హీరో

Published : Mar 25, 2022, 07:51 AM IST
Nikhil Karthikeya2 Shooting: ఫారెన్ షూట్ లో నిఖిల్ కార్తికేయ2,  అప్డేట్ కు రెడీ అవుతున్న యంగ్ హీరో

సారాంశం

కరోనా తగ్గడంతో షూటింగ్స్ హడావిడి ఊపందుకుంది. యంగ్ హీరోలలో నిఖిల్ తన దూకుడు పెంచాడు. పెండింగ్ లో ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో బాగంగానే ఫారెన్  షెడ్యూల్ తో బిజీ అయిపోయాడు నిఖిల్.   

కరోనా తగ్గడంతో షూటింగ్స్ హడావిడి ఊపందుకుంది. యంగ్ హీరోలలో నిఖిల్ తన దూకుడు పెంచాడు. పెండింగ్ లో ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో బాగంగానే ఫారెన్  షెడ్యూల్ తో బిజీ అయిపోయాడు నిఖిల్. 

ఫస్ట్ నుంచీ నిఖిల్ డిఫరెంట్ గానే వెళ్తున్నాడు. కథల విషయంలో.. సినిమాల సెలక్షన్ లో తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నాడు. కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు.  విభిన్నమైన, విలక్షణమైన కథలను ఎంచుకుంటూ  దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న నిఖిల్ కు కరోనా చిన్న బ్రేక్ వేయగా.. ఇక ఇఫ్పుడు ఆ అడ్డంకి తొలగిపోవడంతో.. ఇక చెలరేగిపోతున్నాడు యంగ్ హీర్. 

ఇక గతంలో ఆయన చేసిన కార్తికేయ సూపర్ సక్సెస్ అయ్యింది.  దాంతో కార్తికేయ 2 పేరుతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ను చేస్తున్నారు టీమ్. చందూ మొండేటి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్ కలసి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హిమాచల్ ప్రదేశ్ లో షూట్ చేశారు. 

అంతే కాదు కార్తికేయా2 షూటింగ్ సందడి ఫారెన్ చేరింది. స్పెయిన్, పోర్చుగల్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. అంతే కాదు త్వరలోనే  ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను  కూడా వదలనున్నట్టు చెబుతూ, ఒక ఫోటోను షేర్ చేశారు. కాలభైరవ  సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు నిఖిల్ - అనుపమ కాంబినేషన్లో 18 పేజెస్  మూవీ తెరకెక్కుతోంది. మరి ఈ సినిమాలతో నిఖిల్ ఎంతవరకూ సక్సెస్ అందుకోగలడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌