రాజకీయాల కోసం సినిమాల్ని వదులుకున్న యువ హీరోలు

By Prashanth MFirst Published Jul 5, 2019, 12:05 PM IST
Highlights

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే మరోపని పెట్టుకోకూడదు. ముఖ్యంగా సినీ తారలు ఓ వైపు పాలిటిక్స్ ని మరోవైపు సినీ కెరీర్ ను మెయింటైన్ చేయడమనేది ఈ రోజుల్లో అంత సులువు కాదు. అందుకే ఒకే దారిలో నడవాలని నేటి తరం సినీ తారలు స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతున్నారు. 

రీసెంట్ గా యువహీరోలు ఉదయనిధి స్టాలిన్ అలాగే నిఖిల్ గౌడ సినిమా కెరీర్ ను పక్కనపెట్టి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేశారు. కోలీవుడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నమాజీ సీఎంకరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల తండ్రి స్టాలిన్ సమక్షంలో డీఎంకే యూత్ వింగ్ కార్యదర్శిగా ఎంపికయ్యాడు. 

అదే విధంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడ సైతం జేడీ(ఎస్) యూత్ వింగ్ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. రీసెంట్ గా నిఖిల్ తండ్రి అయిన కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి సమక్షంలో ఆ బాధ్యతలను తీసుకున్నాడు.మొన్న  జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నిఖిల్ ఓడిపోయాడు. ఇక నుంచి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటూ సొంత పార్టీలను బలోపేతం చేయాలనీ ఇద్దరు ఈ హీరోలు సినీ కెరీర్ కు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. 

click me!