విజయ్ దేవరకొండకి యంగ్ హీరో పంచ్..!

Published : Oct 10, 2018, 11:51 AM ISTUpdated : Oct 10, 2018, 11:54 AM IST
విజయ్ దేవరకొండకి యంగ్ హీరో పంచ్..!

సారాంశం

'నోటా' సినిమా రిజల్ట్ ఆశించినట్లుగా రాకపోవడంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ రాశాడు. తన ఫెయిల్యూర్ ని ప్రేమిస్తున్న వారిని పండగ చేసుకోమని మరోసారి ఇలాంటి ఛాన్స్ రాదంటూ తనదైన స్టైల్ లో రాసుకొచ్చాడు

'నోటా' సినిమా రిజల్ట్ ఆశించినట్లుగా రాకపోవడంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ రాశాడు. తన ఫెయిల్యూర్ ని ప్రేమిస్తున్న వారిని పండగ చేసుకోమని మరోసారి ఇలాంటి ఛాన్స్ రాదంటూ తనదైన స్టైల్ లో రాసుకొచ్చాడు.

దీనిపై పరోక్షంగా స్పందించిన హీరో నిఖిల్ ''ఎవరైతే ఈ ప్రపంచం తమ చుట్టూ తిరుగుతుందని అనుకుంటూ అనవసరమైన యాటిట్యూడ్ ని ప్రదర్శిస్తూ ఉంటారో.. డూడ్ నువ్ మరీ అంత ముఖ్యం కాదు.. ప్రతీ నటుడు తనతో తనే పోటీ పడాలి.

మనమంతా సినిమా నిర్మాణం అనే సముద్రంలో నీటి బిండువులం మాత్రమే.. హైప్ లెస్.. వర్క్ మోర్'' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు నిఖిల్ మీద విరుచుకుపడుతున్నారు. నిఖిల్ ని విమర్శిస్తూ రకరకాల ట్వీట్లు పెడుతున్నారు.

కొద్దిసమయం పాటు నిఖిల్ పెట్టిన ట్వీట్ కి మెసేజ్ ల వర్షం కురిసింది. విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన నిఖిల్ సోషల్ మీడియా నుండి తను పెట్టిన పోస్ట్ ని తొలగించారు. 
 
 

సంబంధిత వార్త.. 

నా యాటిట్యూడ్ మారదు.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్