ఛీ.. అవతలకి పో.. ప్రకాష్ రాజ్ ని తిట్టిన హీరో రామ్!

Published : Oct 10, 2018, 11:25 AM ISTUpdated : Oct 10, 2018, 11:28 AM IST
ఛీ.. అవతలకి పో.. ప్రకాష్ రాజ్ ని తిట్టిన హీరో రామ్!

సారాంశం

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తోన్న నూతన చిత్రం 'హలో గురు ప్రేమ కోసమే'. దర్శకుడు త్రినధరావు నక్కిన రూపొందించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

ట్రైలర్ ని బట్టి హీరో రామ్.. హీరోయిన్ ని ఎంతగానో ప్రేమిస్తాడు. వీరి ప్రేమకు సహాయం చేసే ఫ్రెండ్ క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. రామ్ తనకంటే వయసులో పెద్దవాడైన ప్రకాష్ రాజ్ తో స్నేహం చేస్తుంటాడు. ట్రైలర్ లో ఈ పాయింట్ కొత్తగా అనిపించింది. వీరిద్దరి మధ్య సంభాషణలు చాలా సరదాగా సాగాయి.

ఓ సందర్భంలో రామ్ 'ఛీ.. అవతలకి పో' అంటూ ప్రకాష్ రాజ్ ని తిట్టగా అతడు తెల్లముఖం పెడుతూ కనిపించిన సీన్ హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ లో చాలా డైలాగులు ఆకట్టుకున్నాయి. మచ్చుకు కొన్ని.. 

''అమ్మాయిలు అబద్దాలు చెబితే కొడతారో లేదో కానీ అబద్దాలు చెబితే మాత్రం అమ్మాయిలు కచ్చితంగా పడతారు..'' 

''గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం.. కానీ మర్చిపోవాలి, మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం..''. ట్రైలర్ చివరలో డేటా బేస్ ఏంటని హీరోని ప్రశ్నించగా.. తను చెప్పే సమాధానం నవ్వులు పూయించింది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయల్ హీరోయిన్ గా కనిపించనుంది. 

PREV
click me!

Recommended Stories

Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్