విజయ్ దేవరకొండతో పెళ్లిపై నీహారిక రియాక్షన్!

Published : Mar 26, 2019, 04:08 PM IST
విజయ్ దేవరకొండతో పెళ్లిపై నీహారిక రియాక్షన్!

సారాంశం

విజయ్ దేవరకొండకి మెగాఫ్యామిలీ సపోర్ట్ ఇస్తోందని, మెగాడాటర్ నీహారికని విజయ్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో యూట్యూబ్ లలో వార్తలు వచ్చాయి

విజయ్ దేవరకొండకి మెగాఫ్యామిలీ సపోర్ట్ ఇస్తోందని, మెగాడాటర్ నీహారికని విజయ్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో యూట్యూబ్ లలో వార్తలు వచ్చాయి. దీనికి సమాధానంగా 'సూర్యకాంతం' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిహారికకు నేను బిగ్ బ్రదర్ అంటూ  విజయ్ దేవరకొండ ప్రకటించేశాడు.

ఇప్పుడు నీహారిక కూడా తమ మధ్య ఏం లేదని మరోసారి స్పష్టం చేసింది. తనకు విజయ్ దేవరకొండకు పెళ్లి అంటూ యూట్యూబ్ ఛానెల్స్ లో వస్తోన్న వార్తల్ని నీహారిక కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వస్తోందట.

'సూర్యకాంతం' ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆ పుకార్లపై క్లారిటీ ఇవ్వాలని కూడా అనుకుందట. కానీ ఆ వేదికపై రూమర్స్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదంటూ ఊరుకుందట. కానీ విజయ్ 
దేవరకొండ మాత్రం ధైర్యంగా మాట్లాడాడని, తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఓపెన్ గా చెప్పాడని అంటోంది.

'సూర్యకాంతం' ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముందు విజయ్ దేవరకొండని ఒక్కసారి కూడా కలవలేదట నీహారిక. అసలు ఇలాంటి రూమర్లు ఎలా పుట్టిస్తారని ప్రశ్నిస్తోంది. విజయ్ ఇప్పుడు తనను చెల్లిగా ట్రీట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని, అతడిపై గౌరవం మరింత పెరిగిందని చెబుతోంది ఈ మెగాడాటర్. 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి