వర్మ రాజకీయాలకు నీహారిక బలైపోతుందా..?

By Udaya DFirst Published Mar 26, 2019, 3:03 PM IST
Highlights

ఈ ఏడాదిలో సంక్రాంతి తరువాత సినిమాల హవా బాగా తగ్గింది. సరైన సినిమాలు లేక థియేటర్లు బోసిపోయాయి. చిన్న సినిమాలు విడుదలైనప్పటికీ కంటెంట్ లేకపోవడంతో థియేటర్ల వద్ద ఎక్కువ రోజులు నిలవలేకపోయాయి.

ఈ ఏడాదిలో సంక్రాంతి తరువాత సినిమాల హవా బాగా తగ్గింది. సరైన సినిమాలు లేక థియేటర్లు బోసిపోయాయి. చిన్న సినిమాలు విడుదలైనప్పటికీ కంటెంట్ లేకపోవడంతో థియేటర్ల వద్ద ఎక్కువ రోజులు నిలవలేకపోయాయి. అయితే సినీ ప్రియుల కోసం ఈ వారంలో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కేసీఆర్ బయోపిక్ 'ఉద్యమ సింహం', ఎన్టీఆర్ బయోపిక్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్', నీహారిక 'సూర్యకాంతం' సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అయితే ప్రధాన పోటీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'సూర్యకాంతం'ల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలను ఈ సినిమాలో చూపించనున్నారు.

ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. జనాలు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. రాహుల్, నీహారిక జంటగా నటించిన 'సూర్యకాంతం' సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి పోటీగా రానుంది. ట్రైలర్ బాగున్నప్పటికీ సినిమాపై సరైన బజ్ క్రియేట్ కాలేదు. ఓ పక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై రాజకీయ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడడంతో సినిమాకి ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ విధంగా చూసుకుంటే 'సూర్యకాంతం' పై ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సినిమాకి హిట్ టాక్ వస్తే గనుక ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరి నీహారిక నిలదొక్కుకుంటుందా..? లేక వర్మ రాజకీయాలకు బలైపోతుందో.. చూడాలి!

click me!