సల్మాన్‌ ఖాన్‌ వర్జిన్‌ అయితే, నేను వర్జినే.. ట్రోల్స్‌పై స్పందించిన టైగర్‌ ష్రాఫ్‌.. వర్మకి కౌంటర్‌

Published : Aug 05, 2021, 03:49 PM IST
సల్మాన్‌ ఖాన్‌ వర్జిన్‌ అయితే, నేను వర్జినే.. ట్రోల్స్‌పై స్పందించిన టైగర్‌ ష్రాఫ్‌.. వర్మకి కౌంటర్‌

సారాంశం

`మీరు వర్జినా కాదా? అని ప్రశ్నించాడు అర్బాజ్‌. దీనికి టైగర్‌ స్పందిస్తూ, నేను  సల్మాన్‌ ఖాన్‌ లాంటివాడిని` అని తెలిపారు. తనకి కూడా ఎఫైర్స్ ఉన్నాయనే విషయాన్ని పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు టైగర్‌.

వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌పై ఇటీవల చేసిన ట్వీట్‌ దుమారం రేగింది. దీనిపై చర్చనీయాంశంగా మారింది. అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. ఇవి ట్రోల్స్ అయ్యాయి. మరి ఇంతకి వర్మ ఏమన్నాడంటే.. ఇటీవల టైగర్‌ ష్రాఫ్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్న సిక్స్ ప్యాక్‌ ఫోటోని ఉద్దేశించి, `మీరు మార్షల్‌ ఆర్ట్స్ లో గొప్పవారు, కానీ బ్రూస్‌ లీ మీలాగే బికినీ బేబ్‌ లాగా పోజులిస్తే, అతను బ్రూస్‌ లీ అయ్యేవాడు కాదు. దయజేసి ఆలోచించండి. మార్షల్‌ ఆర్ట్స్ లేకుండా కూడా మనిషిలాగా ఉండే, ఇలా ఎప్పుడూ ఇష్టపడని భీదుడు(జాకీ ష్రాఫ్‌) నుంచి మాకోయిజం నేర్చుకోండి` అని ట్వీట్‌ చేశాడు వర్మ. 

ఇది సోషల్‌ మీడియాలో విపరతంగా ట్రోల్‌ అయ్యింది. అటు వర్మపై, ఇటు టైగర్‌పై నెటిజన్లు కామెంట్‌ చేస్తూ ట్రోల్‌ చేశారు. అయితే తాజాగా టైగర్‌ ష్రాఫ్‌ అర్బాజ్‌ ఖాన్‌ టాక్‌ షోలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అర్బాజ్‌ ఖాన్‌ ఈ ట్వీట్‌ని టైగర్‌కి చదివి వినిపించారు. దీనిపై మీ స్పందనేంటి? అని ప్రశ్నించగా, టైగర్‌ రియాక్ట్ అవుతూ, వర్మ చెప్పిన దాన్ని ఏకీభవిస్తూ, బైజాన్‌(సల్మాన్‌ ఖాన్‌) కాకుండా భీదుడి(జాకీ ష్రాఫ్‌) మ్యాచోయిజంతో ఎవరు సరిపోగలరని టైగర్‌ అన్నారు. బ్రూస్‌లీతో కూడా సరిపెట్టుకోవడం కష్టమని తెలిపారు. ఆర్జీవి కచ్చితంగా సరైన విధంగానే చెప్పారని వెల్లడించారు టైగర్‌. 

మరోవైపు ఓ ట్రోల్‌ని టైగర్‌ ముందుంచుతూ, `మీరు వర్జినా కాదా? అని ప్రశ్నించాడు అర్బాజ్‌. దీనికి టైగర్‌ స్పందిస్తూ, నేను  సల్మాన్‌ ఖాన్‌ లాంటివాడిని` అని తెలిపారు. సల్మాన్‌ ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ఎఫైర్స్ నడిపించారు. ఆ లెక్కన తనకి కూడా ఎఫైర్స్ ఉన్నాయనే విషయాన్ని పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు టైగర్‌. సల్మాన్‌ వర్జిన్‌ అయితే తానూ వర్జినే అని తెలిపారు టైగర్‌. అయితే దిశాపటానీతో ప్రస్తుతం ఆయన డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చాలా సందర్భాల్లో మీడియా కంట పడ్డారు. పైగా బాలీవుడ్‌లో వీరి లవ్‌ స్టోరీ గురించి అనేక సందర్భాల్లో చర్చ జరుగుతూనే ఉంది. 

ఇక టైగర్‌ ప్రస్తుతం `హీరోపంతి2` చిత్రంలో నటిస్తున్నారు. తారా సుతారియా హీరోయిన్. అలాగే కృతి సనన్‌తో కలిసి `గనపథ్‌ పార్ట్‌ 1` లో నటిస్తున్నారు. వీటితోపాటు `బాఘి 4`, `గనపథ్‌ పార్ట్ 2`, `ర్యాంబో` రీమేక్‌లో నటించబోతున్నారు టైగర్‌ ష్రాఫ్‌. జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ అనే విషయం తెలిసిందే.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్