
సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మతిపోగొట్టే సోయగాలతో నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అవకాశం రావడంతో నిధి అగర్వాల్ ఆ చిత్రంలో గ్లామర్ షోతో రెచ్చిపోయింది.
ఇన్స్టాగ్రామ్ లో మంచి క్రేజ్ ఉండే హీరోయిన్లలో నిధి అగర్వాల్ కూడా ఒకరు. ఆమె పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉండగా నటీమణులు ఇటీవల ఇంస్టాగ్రామ్ కూడా ఇన్ కమ్ సోర్స్ గా మారింది. ఇంస్టాగ్రామ్ లో చాలా మంది హీరోయిన్లు మద్యం బ్రాండ్స్ కి ప్రచారం కల్పిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నిధి అగర్వాల్ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా సంపాదన మొదలు పెట్టింది. కాకపోతే నిధి అగర్వాల్ ప్రచారం చేస్తున్నది మద్యం బ్రాండ్స్ కి కాదు. ఓ కండోమ్ బ్రాండ్ కి ప్రచారం కల్పిస్తూ నిధి అగర్వాల్ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ పెట్టింది.
కండోమ్ బ్రాండ్ కి ప్రచారం కల్పించడంతో నిధి అగర్వాల్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆకతాయిలు అయితే అసభ్యంగా బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ ఇంస్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి లక్షల్లో ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' చిత్రంలో నటిస్తోంది.