Acharya Trailer: వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్.. కొదమ సింహాల్లా రెచ్చిపోయిన తండ్రీకొడుకులు

Published : Apr 12, 2022, 06:29 PM IST
Acharya Trailer: వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్.. కొదమ సింహాల్లా రెచ్చిపోయిన తండ్రీకొడుకులు

సారాంశం

మెగాస్టార్ అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా అద్భుతమైన ఎలివేషన్స్, చిరంజీవి మార్క్ వార్నింగ్స్, డైలాగ్స్ తో కొరటాల శివ ఆచార్య చిత్రాన్ని వడ్డించబోతున్నారు. 

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల సినిమాలు బలమైన కథతో ఉంటాయి. మరి ఆచార్య కోసం ఈ స్టార్ డైరెక్టర్ ఎలాంటి కథ సిద్ధం చేశారు, మెగాస్టార్ రోల్ ఏంటి అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఆ ఉత్కంఠకు కొంత తెర పడింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆచార్య ట్రైలర్ విడుదలయింది. 

మెగాస్టార్ అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా అద్భుతమైన ఎలివేషన్స్, చిరంజీవి మార్క్ వార్నింగ్స్, డైలాగ్స్ తో కొరటాల శివ ఆచార్య చిత్రాన్ని వడ్డించబోతున్నారు. ట్రైలర్ చూస్తుంటే అభిమానులకు మెగా విందు పక్కా అనిపిస్తోంది. కొన్ని సన్నివేశాల్లో వింటేజ్ మెగాస్టార్ స్పష్టంగా కనిపిస్తున్నారు. కూర్చులో కూర్చుని సోనూ సూద్ కి వార్నింగ్ ఇస్తున్న సన్నివేశం అయితే ట్రైలర్ లో అదుర్స్ అనే చెప్పాలి. ట్రైలర్ లో మరో హైలైట్ మెగా పవర్ స్టార్ రాంచరణ్. 

ఇద్దరూ కామ్రేడ్ పాత్రల్లో కొదమ సింహాల్లా రెచ్చిపోయారు. ఆరంభంలో రాంచరణ్, ఆ తర్వాత చిరంజీవి.. చివర్లో తండ్రి కొడుకుల విధ్వంసం అన్నట్లుగా ఆచార్య ట్రైలర్ సాగింది. కొరటాల శివ చిరంజీవి కోసం సిద్ధం చేసిన ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 

'నేను వచ్చానని చెప్పాలనుకున్నా.. చేయడం మొదలు పెడితే' అంటూ చిరంజీవి చెబుతున్న డైలాగ్ అద్భుతంగా ఉంది. ప్రతి షాట్ లో చిరు తన బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టేస్తున్నారు. చివర్లో చిరంజీవి కామ్రేడ్ అనగానే రాంచరణ్ ఎంట్రీ అదిరిపోతుంది. రాంచరణ్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఉండనే హింట్ ట్రయిలర్ ద్వారా ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మణిశర్మ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్. ట్రయిలర్ లో లీనం అయ్యేలా మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. 

ముందుగా చెప్పుకున్నట్లుగా సినిమా మొత్తం దేవాలయాలు, నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడినట్లు ఉంది. ఓవరాల్ గా ఆచార్య ట్రైలర్ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఉందనే చెప్పాలి. సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే బాక్సాఫీస్ వద్ద ఊచకోతే. 

 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు