ప్రియాంక చోప్రా కాబోయే భర్తకి హెల్త్ ఇష్యూ

By Prashanth MFirst Published Nov 18, 2018, 10:59 AM IST
Highlights

సెలబ్రెటీలకు హెల్త్ ఇష్యూలు ఉంటాయి. అయితే వాటిని వారు బయిటకు చెప్పుకోవటానికి ఇష్టపడరు. అయితే మరికొందరు అటువంటి హెల్త్ ఇష్యూలు ఉన్నా తాము ఈ స్దాయికు వచ్చామని...ప్రేరణగా మరికొంతమందికి నిలవటం కోసం వాటిని బయిటపెడుతూంటారు. 

సెలబ్రెటీలకు హెల్త్ ఇష్యూలు ఉంటాయి. అయితే వాటిని వారు బయిటకు చెప్పుకోవటానికి ఇష్టపడరు. అయితే మరికొందరు అటువంటి హెల్త్ ఇష్యూలు ఉన్నా తాము ఈ స్దాయికు వచ్చామని...ప్రేరణగా మరికొంతమందికి నిలవటం కోసం వాటిని బయిటపెడుతూంటారు. ఇదిగో ఇప్పుడు అమెరికా గాయకుడు, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాకు కాబోయే భర్త నిక్‌ జొనాస్‌ తన హెల్త్ ప్లాబ్లం  గురించి షాకింగ్‌ విషయాలు బయటపెట్టారు. 

నిక్‌ జొనాస్‌ చెప్తూ...తను చిన్నప్పటి నుంచి టైప్‌-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. ట్విటర్‌ , ఇనిస్ట్రగ్రమ్ లో  తనకొచ్చిన ఈ ఆరోగ్య సమస్య  ఉందని  వెల్లడించారు. ‘ 13 సంవత్సరాల క్రితం నాకు టైప్‌-1 డయాబెటిస్‌ ఉందని గుర్తించారు. మధుమేహం ఉందని నిర్ధారించిన  తర్వాత నేను 100పౌండ్ల బరువు తగ్గాను. నాలో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు పెరిగిపోవడం వల్ల బరువు తగ్గాను. తర్వాత నేను డాక్టర్ ని కలిసాను. ఆ తర్వాతే నాకు మధుమేహం ఉందని తెలిసింది.’ అని అన్నారు. 

కంటిన్యూ చేస్తూ..‘ఆ సమస్య ఉందని తెలిసినప్పటి  నుంచి నా ఆరోగ్యం మీద నేనెంతో శ్రద్ధ వహిస్తున్నారు. మంచి ఆహారం తీసుకోవడం, వర్కౌట్లు చేయడం, అప్పుడప్పుడూ బ్లడ్‌ షుగర్‌ను పరీక్షించుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తున్నా.నా దైనందిన జీవితంలో ప్రస్తుతం దీన్ని షుగర్ ని  నియంత్రించగలుగుతున్నా. ఈ హెల్త్ ఇష్యూని నేను తగ్గించుకోవడంలో భాగంగా నాకు అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, నా సన్నిహితులకు రుణపడి ఉంటాను’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో డిసెంబర్‌ 2న వీరిద్దరి వివాహం జరగనుంది. పెళ్లికి  ఇంకా కొద్ది రోజులే ఉండటంతో ఏర్పాట్లు చాలా స్పీడుగా సాగుతున్నాయి.

click me!