విజయ్ దేవరకొండ దొరకక నాతో తీశారు.. యంగ్ హీరో ట్వీట్ వైరల్!

By Udayavani DhuliFirst Published Nov 17, 2018, 4:38 PM IST
Highlights

తోటి హీరో విజయ్ దేవరకొండతో పోలుస్తూ నటుడు సందీప్ కిషన్ ని తక్కువ చేసినట్లుగా ఓ ట్వీట్ పెట్టాడు ఓ నెటిజన్. దీనికి సందీప్ కిషన్ స్పందించిన తీరు ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. సందీప్ కిషన్ హీరోగా దర్శకుడు కునాల్ కోహ్లి 'నెక్స్ట్ ఏంటి' అనే సినిమాను రూపొందించాడు.

ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన సినిమా ట్రైలర్ యువతని ఆకర్షిస్తోంది. ఈ ట్రైలర్ చూసిన ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటించి ఉంటే బాగుండేదని అన్నాడు. ఇలాంటి పాత్రలకు విజయ్ సూట్ అవుతాడని అప్పుడు ట్రైలర్ కి కూడా మంచి వ్యూస్ వచ్చి ఉండేవని అతడి అభిప్రాయం. దీనిపై స్పందించిన సందీప్ కిషన్.. మొదట విజయ్ దేవరకొండనే అనుకున్నారు కానీ తన డేట్స్ దొరకక నాతో సినిమా తీశారని అన్నాడు.

సందీప్ ఊహించని రెస్పాన్స్ కి సదరు నెటిజన్ సిగ్గుపడి.. నా ఉద్దేశం మిమ్మల్ని తక్కువ చేయడం కాదన్నా.. కంటెంట్ ఉన్నా.. ట్రైలర్, టీజర్ కి వ్యూస్ రావడం లేదు అదే విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా'కి కంటెంట్ లేకపోయినా వ్యూస్ బాగా వస్తున్నాయనే ఉద్దేశంలో అన్నానని, క్షమించమని అడిగాడు.

ఈ ట్వీట్ కి స్పందించిన సందీప్.. 'నేనేం బ్యాడ్ గా తీసుకోలేదు. నాకు కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. కష్టపడి సినిమాలు చేస్తున్నాడు' అంటూ చెప్పుకొచ్చాడు. 
 
click me!