Nachindi GirlFriendu Movie: కమర్షియల్ థ్రిల్లర్ గా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

Published : Apr 04, 2022, 08:11 PM ISTUpdated : Apr 04, 2022, 08:14 PM IST
Nachindi GirlFriendu Movie: కమర్షియల్ థ్రిల్లర్ గా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

సారాంశం

యూత్ ను అలరించేందుకు శ్రీరామ ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న తాజా చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ (Nachindi GirlFriendu). రొమాంటిక్ డ్రామాగా, కమర్షియల్ థ్రిల్లర్ గా వస్తోంది ఈ చిత్రం. ఎప్పుడూ వైవిధ్యమైన కథలు ఎంచుకునే ఉదయ్ శంకర్ (Uday Kiran) తన కెరీర్ లో చేస్తున్న మరో విభిన్న చిత్రమిది. జెన్నీ (Jenny) హీరోయిన్ గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఉగాది పండుగ సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు.

ఈ టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  పోస్టర్ చూస్తే... హీరోయిన్ కు రోజ్ ఫ్లవర్ ఇస్తూ లవ్ ప్రపోజ్ చేస్తున్న కథానాయకుడిని వద్దని వారిస్తున్నాడు అతని స్నేహితుడు. నచ్చింది గర్ల్ ఫ్రెండూ అనే టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ తో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనే ఆసక్తి కలుగుతోంది. సీనియర్ హీరో సుమన్ (Suman), పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో  నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ వేలో చూపించబోతున్నారు.

చిత్రంలో నటీ నటులు : ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, సీనియర్ హీరో సుమన్,  మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు నటిస్తున్నారు.  సినిమాటోగ్రఫీగా సిద్దం మనోహార్ పనిచేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ట్రెండీ మ్యూజిక్ అందించనున్నారు. ఎడిటర్ గా జునాయిద్ సిద్దిఖి, ఆర్ట్ డైరెక్టర్ గా దొలూరి నారాయణ, పీఆర్ వోగా జియస్ కె మీడియా వ్యవహిరిస్తోంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?