ప్రభాస్ లుక్ పై ట్రోల్స్... అంకుల్ అంటూ నెగిటివ్ కామెంట్స్

By team teluguFirst Published Aug 27, 2021, 8:18 AM IST
Highlights

డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలలో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. ఈ సినిమాలు ప్రభాస్ కి భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. అప్పటితో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభాస్ లో చాలా మార్పు కనిపిస్తుంది.


బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ లుక్ లో విపరీతమైన మార్పు చోటు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒకప్పటి గ్లామర్ కోల్పోయారు. బాహుబలి 2 విడుదలైన రెండేళ్లకు సాహో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాహోలో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ముఖంలో చార్మ్ కోల్పోయిన ప్రభాస్, ఒకప్పటి వేగం చూపించలేకపోయారు. అసలు ప్రభాస్ ఏమిటీ ఇలా అయిపోయాడనే టాక్ నడిచింది. 

డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలలో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. ఈ సినిమాలు ప్రభాస్ కి భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. అప్పటితో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభాస్ లో చాలా మార్పు కనిపిస్తుంది. ప్రభాస్ కి పెద్దగా వయసు కూడా లేదు. కేవలం 40 ప్లస్ లో ఉన్నారు ఆయన. ప్రభాస్ లుక్ మాత్రం ఉన్న వయసుకంటే అధికంగా కనిపిస్తుంది. సాధారణంగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు అసలు వయసు కంటే ఓ పదేళ్లు తక్కువ కనిపిస్తారు. ప్రభాస్ మాత్రం అందుకు భిన్నంగా పదేళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. 


ఇక సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ లుక్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. యాంటీ ఫ్యాన్స్ ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ప్రభాస్ ఫోటోలు బయటికి రాగా, ఆయన అంకుల్ లా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. నార్త్ ప్రేక్షకులు కూడా ప్రభాస్ లుక్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ గా భారీ ఫేమ్ తెచ్చుకున్న ప్రభాస్, తన లుక్, గ్లామర్ పై దృష్టి పెడితే మంచిది అని, చాలా మంది అభిప్రాయం. 


 

click me!