పిల్లలకు లిప్ కిస్... బాలీవుడ్ నటిపై దారుణంగా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

By Mahesh JujjuriFirst Published Mar 22, 2023, 2:53 PM IST
Highlights

తన పిల్లలకు లిప్ కిస్ లు ఇస్తూ.. బాలీవుడ్ నటి ఛవి మిట్టల్   ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలపై మండిపడుతున్నారునెటిజన్లు..  దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. 
 

పిల్లలను ముద్దు చేయడం తప్పులేదు. వారితో సరదాగా ఉంటూ.. ఆడించడం ముద్దులు పెట్టడం కామన్. అయితే ఎవరైనా  పిల్లలకు ముద్దులు ఎక్కడ ఇస్తారు. బుగ్గమీద పెడతారు. ప్రేమగా నుదురును ముద్దాడుతారు. కాని పిల్లలకు పెదాలమీద ముద్దు పెట్టడం అనేది చాలా అరుదు. ఎవరూ ఇలాంటి పని చేయరు. కొంత మంది చేసినా. ఏదొ తెలియక సడెన్ గా అలా ముద్దు పెడుతంటారు. కాని వాంటెడ్ గా పిల్లలకు లిప్ కిస్ ఇచ్చి.. మళ్ళీ ఏదో గొప్పపని చేసినట్టు.. వాటిని ఫోటో తీసుకుని.. అవి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది బాలీవుడ్ నటి.. నెటిజన్ల చేత అక్షింతలు వేయించుకుంటుంది. 

తాజాగా బాలీవుడ్ నటి ఛవి మిట్టల్ తన పిల్లలకు లిప్ కిస్ లు ఇస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలు ఇలా పోస్ట్ చేసిందో లేదో.. అలా ట్రోల్స్ మొదలయ్యాయి. పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. పిల్లలకు లిప్ కిస్ ఇవ్వడమేంటి, వాళ్లకు ఇప్పట్నుంచే ఏం నేర్పిస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తూ కామెంట్స్ చేయగా, మరికొంతమంది పిల్లలకు మీ బ్యాక్టీరియాని పంచుతున్నారు, ఆరోగ్యపరంగా ఇది మంచిది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఇలా చిన్న పిల్లలకు లిప్ కిస్ ఇస్తున్న ఫోటోలని ఛవి మిట్టల్ పోస్ట్ చేయడంతో... ఆమెను వదిలిపెట్టడంలేదు నెటిజన్లు..  మాములు జనాలతో పాటు.. బాలీవుడ్  ప్రముఖులు కూడా ఆమె చేసిన పనిని తప్పుపడుతున్నారు. కామెంట్స్ రూపంలో వారి అభిప్రయాలు తెలియజేస్తుననారు. మరికొంత మంది మాత్రం.. నువ్వు పెడితే పెట్టావు.. కాని ఇలా అందరికి తెలిసేలా ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అంటూ.. తిట్టిపోస్తున్నారు. 

అయితే  ట్రోల్స్ చేస్తే.. తన తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవాలి.. కాని ఈ కామెంట్స్ చూసి మరీ రెచ్చిపోయింది చవీ మిట్టల్. ఆగకుండా మరిన్ని లిప్ కిస్ ఫోటోలు పోస్ట్ చేసింది. తన పిల్లలకు లిప్ కిస్ లు ఇస్తున్న ఫోటోలు మరిన్ని షేర్ చేసి.. ఒక తల్లి పిల్లలపై చూపించే ప్రేమకి ఇలాంటి కామెంట్స్ వస్తాయని నేను ఊహించలేదు. నేను నా పిల్లలకు ముద్దులు ఇస్తున్న మరి కొన్ని ఫోటోలు కూడా షేర్ చేస్తున్నాను అంటూ ఎక్కువ ఫోటోలు శేర్ చేసింది. 

నా పిల్లలపై ఉన్న నాకున్న ప్రేమ అమితమైనది. దాన్ని ఎలా చూపించాలో తెలియదు. అందుకే నేను ఇలానే చూపిస్తాను. ప్రేమను చూపించడంలో ఇదొక పద్ధతి. కౌగలింతలు, ముద్దులతో వారిపై నాకున్న ప్రేమను చూపిస్తాను. నాపై వచ్చిన ట్రోల్స్ కి నాకు సపోర్ట్ గా నిలిచినవాళ్లకు థాంక్యూ, ఇంకా మానవత్వం బతికే ఉంది. ఇలా అనే వాళ్ళు తమ పిల్లలపై ప్రేమను ఎలా చూపిస్తారో తెలియచేయండి అని కౌంటర్ ఇచ్చింది ఛవి మిట్టల్.  అంతే కాదు మరికొంత మంది మాత్రం చవి మిట్టల్ కు సపోర్ట్ చేస్తూ.. వారి పిల్లలకు ముద్ద పెట్టిన ఫోటోలు శేర్ చేశారు. 

click me!