విడాకులు వార్తల నేపథ్యంలో ఆసక్తిరేపుతున్న నిహారిక సోషల్ మీడియా పోస్ట్!

Published : Mar 22, 2023, 01:53 PM ISTUpdated : Mar 22, 2023, 02:17 PM IST
విడాకులు వార్తల నేపథ్యంలో ఆసక్తిరేపుతున్న నిహారిక సోషల్ మీడియా పోస్ట్!

సారాంశం

నాగబాబు తనయ నిహారిక విడాకులు వార్తలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె ఓ సోషల్ మేడి పోస్ట్ పెట్టారు.   

గత రెండు రోజులుగా నటుడు నాగబాబు తనయ నిహారిక విడాకుల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల అనంతరం నిహారిక మొదటిసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే ఇది తనపై వస్తున్న రూమర్స్ కి సంబంధించింది కాదు. విడాకుల వార్తలకు ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ఓ ప్రమోషనల్ వీడియో పంచుకున్నారు. త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రోమో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో తెరకెక్కుతున్నఈ ప్రాజెక్ట్ నిహారిక నిర్మించి, నటిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  విడాకుల వార్తలపై ఆమె స్పందించారని అనుకున్న ఫ్యాన్స్, కాదని తెలుసుకుని ఉసూరుమన్నారు.

 నిహారిక, వెంకట చైతన్య సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు అన్ ఫాలో అయ్యారు. వెంకట చైతన్య పెళ్లి ఫొటోలతో పాటు నిహారికతో ఉన్న ఫోటోలు డిలీట్ చేశారు. ఇవి విడాకుల వార్తలకు దారితీశాయి. ఐతే నిహారిక పెళ్లి ఫోటోలు తన అకౌంట్ నుండి తొలగించలేదు.వెంకట చైతన్య, నిహారిక మధ్య గొడవలు నిజమైతే కారణాలు ఏమిటనే అన్వేషణ మొదలైంది. నిహారిక 2020 డిసెంబర్ 9వ తేదీన గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్నారు. వెంకట చైతన్య తండ్రి ప్రభాకర్ రావు పోలీస్ అధికారి. ఆయనకు చిరంజీవి కుటుంబంతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. 

నిహారిక యాక్టింగ్ కెరీర్ గా ఎంచుకున్న విషయం తెలిసిందే. ఒక మనసు మూవీతో ఆమె హీరోయిన్ అయ్యారు. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాలు చేశారు. చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరాలో చిన్న గెస్ట్ రోల్ చేశారు. నిర్మాతగా వెబ్ సిరీస్లు, స్మాల్ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. వివాహం అనంతరం కూడా యాక్టింగ్ కొనసాగించనున్నట్లు నిహారిక తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?