
'కియా మోటార్స్' ఏపీకి రావడంపై మంచు మనోజ్ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఓ ట్వీట్ చేశాడు. కానీ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఎందుకు ట్వీట్ తొలగించాల్సి వచ్చిందంటూ మనోజ్ ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు.
దీంతో తన స్నేహితుడి కారణంగా ట్వీట్ డిలీట్ చేయాల్సివచ్చిందని మనోజ్ మరో ట్వీట్ చేశాడు. కొద్దిసేపటికి ఆ ట్వీట్ కూడా తొలగించాడు. దీంతో నెటిజన్లు అసలు ఎందుకు ఇలా ట్వీట్లు డిలీట్ చేస్తున్నారంటూ మనోజ్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
దీంతో మనోజ్ చేసిన ఒక ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఇంతకీ మనోజ్ ఏమని ట్వీట్ చేశాడంటే.. ''నేను పెట్టిన ట్వీట్ డిలీట్ చేశాననుకునే ప్రతీ ఒక్కరికీ.. 'నా ఇష్టం'. నేను ఎవరి కారణంగానో ప్రభావితమై ట్వీట్ డిలీట్ చేశానని భావించే వారందరికీ.. నా డ్యాష్(ఎవరికీ అంత బొమ్మ లేదు).. నేను నిజాయితీగా ఉన్నానని భావించే ప్రతి ఒక్కరికీ.. 'వెధవలని లైట్ తీసుకోండి'(పాపం వాళ్లూ మన భారతీయులే'' అంటూ రాసుకొచ్చాడు.
ఓ సెలబ్రిటీగా మంచు మనోజ్ అసభ్యకర పదజాలం వాడడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.