ఆసక్తి రేపుతున్న నెట్ఫ్లిక్స్ ఒరిజినల్  నవరస!

Published : Jul 09, 2021, 11:37 AM ISTUpdated : Jul 09, 2021, 11:42 AM IST
ఆసక్తి రేపుతున్న నెట్ఫ్లిక్స్ ఒరిజినల్  నవరస!

సారాంశం

నవరస ప్రమోషనల్ వీడియో విడుదల చేయగా ఆసక్తి రేపుతోంది. ఏ ఆర్ రెహమాన్ స్వరపరచిన బీజీఎమ్, నటుల ఎక్స్ ప్రెషన్స్ కలగలిపి అద్భుతంగా ప్రమోషనల్ వీడియో ఉంది. ఇక ఆగష్టు 6నుండి నవరస యాన్థాలజీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.   


లాక్ డౌన్ పరిస్థితులు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ని ప్రేక్షకులకు దగ్గర చేశాయి. థియేటర్స్ మూతపడడంతో సినీప్రియులకు ఓటిటి రంగం ప్రత్యామ్నాయంగా కనిపించింది. అమెజాన్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ప్రపంచ దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ భారత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కొల్లగొడుతున్నాయి. వీటితో పాటు లెక్కకు మించిన దేశీయ ఓటిటి సంస్థలు ఆడియన్స్ కి గాలం వేస్తున్నాయి
.

భవిష్యత్ మొత్తం ఓటిటి లదే అని గమనించిన టాలీవుడ్ నిర్మాతలు ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేశారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా అనే తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ స్థాపించి, భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. వెండితెరపై అంతగా అవకాశాలు లేని తారలు, నటులకు ఓటిటి గొప్ప ఆప్షన్ గా నిలిచింది. చిన్నగా స్టార్స్ కూడా ఇటువైపు అడుగులు వేస్తున్నారు. 


మణిరత్నం నిర్మాతగా నవరస పేరుతో  యాంన్థాలజీ సిరీస్ తెరకెక్కగా సూర్య, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటిస్తున్నారు. అరవింద్ స్వామి, బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, ప్రియదర్శన్, రతీంద్రన్ ప్రసాద్, సర్జున్, వసంత్ సాయి దర్శకులుగా 9స్టోరీస్ తెరకెక్కించారు. ఈ స్టోరీస్ లలో సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, యోగి బాబు, సిధార్థ, బాబీ సింహలతో పాటు కోలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ నటులు ఈ సిరీస్ లో భాగం అయ్యారు. 


నవరస ప్రమోషనల్ వీడియో విడుదల చేయగా ఆసక్తి రేపుతోంది. ఏ ఆర్ రెహమాన్ స్వరపరచిన బీజీఎమ్, నటుల ఎక్స్ ప్రెషన్స్ కలగలిపి అద్భుతంగా ప్రమోషనల్ వీడియో ఉంది. ఇక ఆగష్టు 6నుండి నవరస యాన్థాలజీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా