ఎవరైనా పర్లేదు పెళ్లి చేసుకో... ఆ భయంతో తాప్సి పేరెంట్స్ డిమాండ్

By team teluguFirst Published Jul 9, 2021, 11:01 AM IST
Highlights

చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న తాప్సిని పేరెంట్స్ మాత్రం పెళ్లి చేసుకోమని  పెడుతున్నారట. దానికి కారణం ఆమె ఎక్కడ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోతుందో అనే భయం వారిని వెంటాడుతుందట. 

హీరోయిన్ తాప్సి పేరెంట్స్ కి ఆమె పెళ్లి భయం పట్టుకుందట. ఎవరైనా పర్లేదు వెంటనే పెళ్లి చేసుకొని అని ఒత్తిడి చేస్తున్నారు. వారి భయానికి కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చింది తాప్సి. ఝుమ్మంది నాదం మూవీతో వెండితెరకు పరిచయమైన తాప్సి, తెలుగులో ప్రభాస్ వంటి స్టార్స్ సరసన కూడా చేశారు. స్టార్ హీరోయిన్ హోదా అందుకోలేకయినా పాప్యులర్ హీరోయిన్ గా ఫ్యాన్స్ బేస్ సంపాదించారు. 


తెలుగులో ఫేడవుట్ అయిన తాప్సి బాలీవుడ్ లో బిజీగా మారడం జరిగింది. అక్కడ వరుసగా ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నడిచిన బద్లా, పింక్ మంచి విజయాలు అందుకున్నాయి. ఇక తెలుగు తమిళ హిందీ బాషలలో కలిపి అరడజనుకు పైగా చిత్రాలు చేస్తుంది తాప్సి. లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా ఈ లిస్ట్ లో ఉంది. 


చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న తాప్సిని పేరెంట్స్ మాత్రం పెళ్లి చేసుకోమని  పెడుతున్నారట. దానికి కారణం ఆమె ఎక్కడ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోతుందో అనే భయం వారిని వెంటాడుతుందట. అబ్బాయి ఎవరైనా పర్లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం ముఖ్యం, త్వరగా పెళ్లి చేసుకో అని ఆమెను ఒత్తిడి చేస్తున్నారట. ఈ విషయాన్ని తాప్సి స్వయంగా చెప్పడం జరిగింది. 


33ఏళ్ల తాప్సి మరి పేరెంట్స్ మాట ఎంత వరకు వింటారో చూడాలి. ఆమె లేటెస్ట్ మూవీ హసీన్ దిల్ రుబా నెట్ఫ్లిక్స్ లో విడుదల కావడం జరిగింది. ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. 
 

click me!