టాలీవుడ్‌లో నెపోటిజం.. ఆ టాప్‌ స్టార్స్ ని బుక్‌ చేశారుగా!

Published : Nov 04, 2020, 09:56 PM IST
టాలీవుడ్‌లో నెపోటిజం.. ఆ టాప్‌ స్టార్స్ ని బుక్‌ చేశారుగా!

సారాంశం

తెలుగులో వారసత్వం, బంధుప్రీతి పై ఏకంగా సినిమానే వస్తుంది. `నెపోటిజం` పేరుతో ఓ చిత్రం రూపొందుతుంది. `ఒకవేళ హీరోలు.. హీరోల కుటుంబంలో పుట్టకపోయి ఉంటే.. హీరోలు అయ్యేవారా?` అని కాప్షన్‌తో ఈ సినిమాని రూపొందుతుండటం చర్చనీయాంశంగా మారడంతోపాటు ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో బాలీవుడ్‌లో నెపోటిజం చర్చనీయాంశంగా మారింది. కొత్త వారిని రానివ్వడం లేదనే ప్రచారం జరిగింది. కంగనా రనౌత్‌ వంటి వారు ఈ అంశాన్ని పెద్ద చర్చకు తెరలేపారు. ఈ నేపథ్యంలో తెలుగులో వారసత్వం, బంధుప్రీతి పై ఏకంగా సినిమానే వస్తుంది. `నెపోటిజం` పేరుతో ఓ చిత్రం రూపొందుతుంది. `ఒకవేళ హీరోలు.. హీరోల కుటుంబంలో పుట్టకపోయి ఉంటే.. హీరోలు అయ్యేవారా?` అని కాప్షన్‌తో ఈ సినిమాని రూపొందుతుండటం చర్చనీయాంశంగా మారడంతోపాటు ఆసక్తిని రేకెత్తిస్తుంది.

విపుల్‌ దర్శకత్వంలో వై.అనిల్‌ కుమార్‌, కె.శ్రీనివాసరావు పాపిన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కొర్రపాటి వెంకటరమణ సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకీ, వాసిం, వెంకట్‌ పొడి శెట్టి, జగదీష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర లిరికల్‌ వీడియో సాంగ్‌ని దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన షాకింగ్‌ కామెంట్‌ చేశారు. `టాలీవుడ్‌లో నెపోటిజం ఉన్న మాట వాస్తవమే  అని, చాలా మంది హీరోల కొడుకులు, డైరెక్టర్స్ కొడుకులు హీరోలుగా ట్రై చేశారు. ఫెయిల్‌ అయ్యి వెళ్ళిపోయారని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కూడా వచ్చి తమ టాలెంట్‌తో సూపర్‌ స్టార్‌ అయిన వాళ్ళు కూడా ఉన్నారన్నారు. 

మన ప్రతిభని ప్రదర్శించుకునేందుకు దానికి పట్టుదల కావాలని, సిన్సియర్‌గా కష్టపడాలన్నారు. ఈ కాన్సెప్ట్ తోనే `నెపోటిజం` సినిమాని తీశారని భరద్వాజ తెలిపారు. ఇతరులను తిట్టకుండా సొంతంగా కష్టపడితే టాప్‌ పొజిషియన్‌కి వస్తామనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందన్నారు. ఇమిటేట్‌ చేస్తే ఎక్కువ కాలం మనుగడ సాధించలేమని, సొంత ప్రతిభతోనే, సొంత స్టయిల్‌ని క్రియేట్‌ చేసుకోవాలన్నారు. `పుట్టగానే ఎవ్వరూ స్టార్ కారు. స్టార్ అవ్వడానికి ఎవరైనా కఠోర శ్రమ చేయాలనేది ఇందులో చూపిస్తున్నామని, సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నామ`ని దర్శకుడు విపుల్‌ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా అల్లు అర్జున్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌ల గెటప్‌లో చిత్ర నటులను పెట్టి పోస్టర్‌ విడుదల చేయడం ఆకట్టుకుంటుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్