ఛీటింగ్ కేసు: ప్రముఖ నిర్మాతకు మూడేళ్లు జైలు శిక్ష

By Surya PrakashFirst Published Nov 4, 2020, 4:57 PM IST
Highlights

 మణిచిత్ర తాళు (తెలుగులో చంద్రముఖి) వంటి సూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అలాగే రామోజీరావు స్పీకింగ్, ది గాఢ్ ఫాధర్ , వియత్నాం కాలనీ వంటి సినిమాలు ఆయనే ప్రొడ్యూస్ చేసారు. అయితే కాలక్రమంలో డబ్బు ఇబ్బందులు వచ్చాయి. చేసిన అప్పులు తీర్చలేక జైలు పాలయ్యే పరిస్దితి వచ్చింది. 

మళయాళ పరిశ్రమలో స్వర్గాచిత్ర అప్పచాన్‌ కు చాలా పెద్ద పేరు ఉంది. ఆయన చాలా పాపులర్ ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు మళయాళ చిత్ర పరిశ్రమలో మైల్ స్టోన్స్ లా మిగిలాయి. మణిచిత్ర తాళు (తెలుగులో చంద్రముఖి) వంటి సూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అలాగే రామోజీరావు స్పీకింగ్, ది గాఢ్ ఫాధర్ , వియత్నాం కాలనీ వంటి సినిమాలు ఆయనే ప్రొడ్యూస్ చేసారు. అయితే కాలక్రమంలో డబ్బు ఇబ్బందులు వచ్చాయి. చేసిన అప్పులు తీర్చలేక జైలు పాలయ్యే పరిస్దితి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే...కోలీవుడ్‌ స్టార్ విజయ్‌ నటించిన అళగియ తమిళ్ మగన్‌ సినిమా సమయంలో విజయ్ తండ్రి ఏఎస్‌ చంద్రశేఖర్‌తో కోటి రూపాయాలను తీసుకున్న అప్పచాన్‌.. దాన్ని తిరిగి ఇవ్వలేదు. దీనిపై చాలా సంవత్సరాల తరువాత కేసు నమోదైంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇటీవల కోర్టు తీర్పు వెల్లడించగా.. న్యాయస్థానం అప్పచాన్ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ఈ కేసు అప్పట్లో కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. విజయ్‌తో రెండు సూపర్‌హిట్‌ సినిమాలను తీసిన నిర్మాతపై చంద్రశేఖర్‌ కేసు వేయడం తమిళనాట అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. 

click me!