‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ టీజర్ అనౌన్స్ మెంట్.. మాస్ లుక్ లో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం..

Published : Jul 07, 2022, 06:39 PM ISTUpdated : Jul 07, 2022, 06:40 PM IST
‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ టీజర్ అనౌన్స్ మెంట్.. మాస్ లుక్ లో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం..

సారాంశం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. మరో చిత్రాన్ని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఆ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ను అందించారు. 

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పుడిప్పుడే ఈ యంగ్ హీరో స్టార్ హీరోగా ఎదిగేందుకు మార్గం సుగుమం చేసుకుంటున్నారు. ఇందు కోసం కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్ లో పెడుతూ తెలుగు ఆడియెన్స్ ను ఆశ్చర్య పరుస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ షాకిస్తున్నాడు. మూడు నెలల గ్యాప్ లో సెబాస్టియన్ పీసీ 524, సమ్మతమే చిత్రాలను రిలీజ్ చేసి ఆడియెన్స్ అటెన్షన్ డ్రా చేశాడు. తాజాగా తన రాబోయే చిత్రం‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు. 

లేటెస్ట్ గా Nenu Meeku Baga Kavalsinavadini నుంచి అదిరిపోయే అప్డేట్ అందింది. గతంలోనే ఈ చిత్రాన్ని ప్రకటించిన కిరణ్ అబ్బవరం మూవీ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశాడు.  ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు చకాచకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా నుంచి టీజర్ విడుదల చేయనున్నట్టు  క్రేజీ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. జూలై 10న ఉదయం 11 గంటల 05 నిమిషాలకు ఈ అప్డేట్ రానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో కిరణ్ ను అభిమానించే వారు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంజనా ఆనంద్ (Sanjana Anand) జంటగా నటిస్తున్నారు. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్ శ్రీధర్ గాడేనే ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.  కోడి రామక్రిష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి మూవీని నిర్మిస్తున్నది. కోడీ దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘నేను మీకు బాగా తెలిసిన వాడిని’ చిత్రం తెరకెక్కబోతోంది. టీజర్ అప్డేట్ పై కిరణ్ అబ్బవరం స్పందిస్తూ శ్రీధర్ గాడే దర్శకత్వంలో మరోసారి నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా