ఈ శుక్రవారం బాక్సాఫీస్ హోరాహోరీ.. రెండింటిలో కేథరిన్

Published : Aug 09, 2017, 11:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఈ శుక్రవారం బాక్సాఫీస్ హోరాహోరీ.. రెండింటిలో కేథరిన్

సారాంశం

ఈ శుక్రవారం రిలీజ్ కానున్న నేనే రాజు నేనే మంత్రి, జయజనాకినాయక బాక్సాఫీస్ వద్ద హోరాహోరీగా తలపడనున్న రానా, శ్రీనివాస్, నితిన్ రానా, శ్రీనివాస్ ల సినిమాల్లో రెండింటిలోనూ కేథరిన్

ఎమ్మెల్యే పాపగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన నటి కేథరిన్ ట్రెసా. ఈ భామ టాలీవుడ్లోకి అరంగేట్రం చేసి చాలా ఏళ్లే అయింది. ఐతే ఆమె ఆశించిన విజయం మాత్రం గత ఏడాది ‘సరైనోడు’తోనే దక్కింది. ఐతే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కేథరిన్ కు అవకాశాలకు మాత్రం కొదువలేదు.

 

ఈ మధ్యే కేథరిన్ గోపీచంద్ సరసన ‘గౌతమ్ నంద’తో పలకరించింది. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ కేథరిన్ గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. ఈ శుక్రవారం కేథరిన్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. ఆ రెండు సినిమాల్లోనూ కేథరిన్ తనకు నప్పే గ్లామర్ రోల్సే చేసింది. ఆ సినిమాలకు ఆమె స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని భావిస్తున్నారు.

 

‘నేనే రాజు నేనే మంత్రి’లో లీడ్ హీరోయిన్ కాజలే అయినప్పటికీ కేథరిన్ కూడా కీలక పాత్రే చేస్తున్నట్లు దర్శకుడు తేజ చెప్పాడు. ట్రైలర్లో సిగరెట్ తాగుతూ కనిపించిన కేథరిన్ తన పాత్రపై ఆసక్తి రేకెత్తించింది. కాజల్ కొంచెం పద్ధతిగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇందులో గ్లామర్ పార్ట్ అంతా కేథరిన్ చూసుకుంటుందేమో. ఇక కేథరిన్ నటించిన మరో సినిమా ‘జయ జానకి నాయక’. మామూలుగా కేథరిన్ సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తుంటుంది కానీ.. ‘జయ జానకి..’లో ఏకంగా ముగ్గురు హీరోయిన్లున్నారు. 
 

రకుల్ ప్రీత్ ప్రధాన కథానాయికగా నటించగా.. ప్రగ్యా, కేథరిన్ అందాల ప్రదర్శనలో పోటీ పడనున్నారు. కేథరిన్ కనిపించే పాట ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పాటలో కేథరిన్ రెచ్చిపోయినట్లే ఉంది. మరి ఈ శుక్రవారం రాబోయే రెండు సినిమాలు కేథరిన్ కు డబుల్ ధమాకా ఫలితాన్నిస్తాయేమో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే