`ఎన్బీకే 108` నెక్ట్స్ షెడ్యూల్‌ పోస్ట్ పోన్‌.. తారకరత్న కోసం బాలయ్య నిర్ణయం..

Published : Feb 20, 2023, 02:40 PM IST
`ఎన్బీకే 108` నెక్ట్స్ షెడ్యూల్‌ పోస్ట్ పోన్‌.. తారకరత్న కోసం బాలయ్య నిర్ణయం..

సారాంశం

బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఎన్బీకే108` మూవీ నెక్ట్స్ షెడ్యూల్‌ వాయిదా పడింది. తారకరత్న హఠాన్మరణంతో టీమ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో `ఎన్బీకే108` చిత్రంలో నటిస్తున్నారు. బాలయ్య కోసం తన పంథా మార్చి అనిల్‌ రావిపూడి చేస్తున్న చిత్రమిది. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ని మేళవిస్తూనే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంది. అయితే తారకరత్న అనారోగ్యానికి గురైన నేపథ్యంలో అప్పట్నుంచి షూటింగ్‌ కి గ్యాప్‌ ఇచ్చారు. 

బాలకృష్ణ పూర్తిగా తారకరత్నకి ట్రీట్‌మెంట్‌ని దగ్గరుండి చూసుకుంటున్నారు. అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించారు. వైద్యుల నుంచి అలాంటి సంకేతాలే రావడంతో ఇక తాను అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించబోతున్న సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ ప్రారంభించేందుకు ప్లాన్‌ చేశారు. ఈ నెల 23 నుంచి కొత్త షెడ్యూల్‌ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ తారకరత్న అనూహ్యంగా కన్నుమూశారు. శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దాదాపు 23 రోజులపాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

దీంతో ఇప్పుడు `ఎన్బీకే108` చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ని పోస్ట్ పోన్‌ చేశారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. క్లిష్ట సమయంలో తారకరత్న ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడాల్సిన అవసరం ఉంది. అందులోనూ బాలయ్య అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తారకరత్న, బాలయ్య మధ్య మంచి బాండింగ్‌ ఉంది. దీంతో పెద్ద కర్మ వరకు బాలకృష్ణ అన్ని కార్యక్రమాలు చూసుకోవాల్సి ఉంటుందని తెలుస్తుంది. నెక్ట్స్ షెడ్యూల్‌కి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 

గతేడాది డిసెంబర్‌ 8న బాలయ్య ఎన్బీకే108 మూవీ ప్రారంభమైంది. షైన్‌ స్క్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో బాలకృష్ణ సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీలీలా కీలక పాత్ర పోషిస్తుంది. సినిమాని దసరాకి విడుదల చేసే ఆలోచనలో టీమ్‌ ఉన్నట్టు సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Love and War: లవ్ అండ్ వార్ సెట్‌లో విషాదం.. భన్సాలీపై చట్టపరమైన చర్యలకు డిమాండ్
Samantha Pregnancy: సారీ, సినిమాల నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నా.. అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత