తారకరత్న మృతితో ఎన్టీఆర్ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ కి నిరాశే, కానీ కుటుంబం కోసం..

Published : Feb 20, 2023, 02:13 PM IST
తారకరత్న మృతితో ఎన్టీఆర్ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ కి నిరాశే, కానీ కుటుంబం కోసం..

సారాంశం

తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతోందనేది అందిరికీ తెలిసిందే. చాలా కాలంగా ఈ చిత్రం లాంచింగ్ అదిగో అదిగో అంటున్నారు కానీ జరగడం లేదు. అభిమానులతే ఈ చిత్రాన్ని త్వరగా ప్రారంభించాలి అని.. అప్డేట్ ఇవ్వాలి అని ట్విట్టర్ లోపలు మార్లు గోల పెట్టారు. 

దీనితో కళ్యాణ్ రామ్ అమిగోస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్వయంగా మాట్లాడుతూ.. ఫ్యాన్స్ ఇలా దర్శకులపై ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు అని.. వారికి కొంత సమయం ఇవ్వాలని ఫ్యాన్స్ ని రిక్వస్ట్ చేశాడు. ఏది ఏమైనా ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో లాంచ్ చేయబోతున్నామని తారక్ ఖరారు చేశాడు. 

అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. తారకరత్న మృతి కారణంగా ఎన్టీఆర్ 30 చిత్ర ప్రారంభోత్సవం మరోసారి వాయిదా వేస్తూ తారక్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంతలో తన సోదరుడు తారకరత్న మృతితో నందమూరి ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. 

కాబట్టి తారకరత్నకి జరగాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ 30 చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం లాంచింగ్ ఎప్పుడు అనేది తర్వాత ప్రకటిస్తారు. బహుశా మార్చి మొదటి వారంలో ఉండొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఎన్టీఆర్ 30 మరోసారి వాయిదా పడడంతో అభిమానులకు నిరాశ తప్పదు. కానీ కుటుంబం కోసమే ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్నారు. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Allu Arjun `డాడీ` మూవీ చేయడం వెనుక అసలు కథ ఇదే.. చిరంజీవి అన్న ఆ ఒక్క మాటతో
Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్‌.. కప్‌ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన