క్లైమాక్స్ పూర్తి చేసుకొన్న బాలకృష్ణ 102వ చిత్రం

Published : Oct 16, 2017, 05:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
క్లైమాక్స్ పూర్తి చేసుకొన్న బాలకృష్ణ 102వ చిత్రం

సారాంశం

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న బాలయ్య 102వ చిత్రం కేఎస్ రవికుమార్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య 102వ చిత్రం బాలయ్యతో మరోసారి జతకట్టిన నయనతార  

నటసింహం నందమూరి బాలకృష్ణ  102వ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ముగిసింది.

 

అరివుమణి-అంబుమణిల సారధ్యంలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్  బాలయ్యపై చిత్రీకరించారు. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, న‌యన‌తార‌, న‌టాషా, హరిప్రియ, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ముర‌ళీ మోహ‌న్‌, జేపీ,  ఎల్బీ శ్రీ‌రామ్‌ల‌తో పాటు ఇత‌ర‌ ప్ర‌ధాన     తారాగ‌ణం కూడా పాలుపంచుకొంది.  

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "అక్టోబర్ 5న మొదలైన క్లైమాక్స్ ఎపిసోడ్ అక్టోబర్ 15 వరకూ నిరాటంకంగా జరిగింది. అరివుమణి-అంబుమణిలు అత్యంత నేర్పుతో సహజంగా ఉండేలా ఈ పోరాట సన్నివేశాలని డిజైన్ చేశారు. మూసాపేట్ లోని కంటైనర్ యార్డ్ లో ఈ కీలకమైన ఎపిసోడ్ ను షూట్ చేశాం. ఇప్పటికే నయనతార, నాటాషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హరిప్రియ మరో కథానాయికగా కనిపించనుంది``  అన్నారు.

PREV
click me!

Recommended Stories

Ram Charan v/s Pawan Kalyan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?