ధోనితో పోల్చుకుంటూ 'జి2' అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఒక్కసారి లోడ్ అయితే..

Published : Apr 05, 2024, 03:58 PM ISTUpdated : Apr 05, 2024, 03:59 PM IST
ధోనితో పోల్చుకుంటూ 'జి2' అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఒక్కసారి లోడ్ అయితే..

సారాంశం

పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు.  అడివి శేష్ వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ అడివి శేష్ వరుస హిట్లు కొడుతున్నాడు.

పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు.  అడివి శేష్ వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ అడివి శేష్ వరుస హిట్లు కొడుతున్నాడు. ఫ్యాన్స్ లో తన చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. అడివి శేష్ చివరగా హిట్ 2లో నటించిన సంగతి తెలిసిందే. అడివిశేష్ కెరీర్ లో గూఢచారి ప్రత్యేకమైన చిత్రం. 

ఇప్పుడు అడివి శేష్ గూఢచారి 2లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి G 2 అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీనితో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో జి 2 చిత్రాన్ని త్వరగా దింపాలని అడుగుతున్నారు. దీనితో అడివి శేష్ స్పందించాడు. 

మహేంద్ర సింగ్ ధోని ఫోటో షేర్ చేసి జి 2 గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్ని ఇంటర్నేషనల్ ఫార్మాట్స్ కి ధోని రిటైర్ అయిన సంగతి తెలిసిందే, దాదాపు 303 రోజుల తర్వాత ధోని మైదానంలోకి అడుగుపెట్టాడు. అయినప్పటికీ ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 

తన జి2 చిత్రం కూడా అంతే అని అడివి శేష్ అంటున్నాడు. లేట్ అవ్వచ్చు కానీ ఒక్కసారి లోడ్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుందని ట్వీట్ చేశాడు. ఈ చిత్రంతో పాటు అడివి శేష్..శృతి హాసన్ తో కలసి డెకాయిట్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?