ఒంటరిగా వెళ్లే నయన్ ఈసారి జంటగా..!

Published : Sep 17, 2018, 10:47 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
ఒంటరిగా వెళ్లే నయన్ ఈసారి జంటగా..!

సారాంశం

దక్షిణాది అగ్ర తార నయనతార కొంత కాలంగా దర్శకుడు, నటుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంలో ఆమె తనకు కాబోయే భర్తగా విఘ్నేష్ పేరుని ప్రస్తావించింది. 

దక్షిణాది అగ్ర తార నయనతార కొంత కాలంగా దర్శకుడు, నటుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంలో ఆమె తనకు కాబోయే భర్తగా విఘ్నేష్ పేరుని ప్రస్తావించింది.

తరచూ వీరిద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్ లకు వెళ్లడం, సినిమా వేడుకలకు హాజరవ్వడంతో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం జరిగింది. మొన్నామధ్య అమెరికాలో సందడి చేసిన ఈ జంట తాజాగా గోల్డెన్ టెంపుల్ లో కనిపించారు.

నయన్ తరచూ అమృత్ సర్ కి వెళ్లొస్తుంటుంది. ఎప్పుడు వెళ్లినా ఒంటరిగా వెళ్లే నయనతార ఈసారి మాత్రం విఘ్నేష్ ని వెంటబెట్టుకొని వెళ్లడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నయనతార.. అజిత్ హీరోగా 'విశ్వాసం' సినిమాలో నటిస్తోంది.

తెలుగులో మెగాస్టార్ సరసన 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆమె చేతిలో మరో రెండు తమిళ సినిమాలు ఉన్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు
అప్పటిదాకా అబ్బాయిల ఊసే లేదు..! హీరోయిన్ శ్రీలీల అంత మాట అనేసిందేంటి..