కాబోయే అల్లుడితో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న నయనతార తల్లి!

Published : Sep 15, 2021, 07:58 AM IST
కాబోయే అల్లుడితో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న నయనతార తల్లి!

సారాంశం

నయనతార తల్లి ఓమన కురియన్ బర్త్ డేను వీరిద్దరూ కలిసి సెలెబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించడంతో పాటు పూల గుచ్చాలు, బహుమతులు అందించి, ఆమెను సంతోష పరిచారు. నయనతార తల్లి బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార, విగ్నేష్ శివన్ ల అన్యోన్యత, ప్రేమానురాగాలు చూస్తే ఎవరైనా కుళ్ళు కుంటారు. ఐదేళ్లకు పైగా డేటింగ్ చేస్తున్న ఈ జంట, ప్రతి చిన్న వేడుక కలిసి జరుపుకుంటారు. పండగలు పబ్బాలకు ఒకరికి ఇంటికి మరొకరు వెళతారు. పెళ్లి కాకున్నా, విగ్నేష్ నయనతార వాళ్ళ ఇంటికి అల్లుడిగా చలామణి అవుతున్నాడు. 


ఈ క్రేజీ లవ్ కపుల్ బర్త్ డే వేడుకలు మరింత అందంగా జరుపుకుంటారు. బర్త్ డే ఎవరిదైనా ఇద్దరూ కలిసి, ఇష్టమైన ప్రదేశానికి చెక్కేస్తారు. ఒకరికి మరొకరు ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. ముఖ్యంగా విగ్నేష్ బర్త్ డేని స్పెషల్ గా నిర్వహిస్తుంది నయనతార. అలాగే కేరళవాసుల అతిపెద్ద పండుగైన ఓనమ్ కి ఖచ్చితంగా విగ్నేష్ నయనతార ఇంటికి వెళతారు. 


తాజాగా నయనతార తల్లి ఓమన కురియన్ బర్త్ డేను వీరిద్దరూ కలిసి సెలెబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించడంతో పాటు పూల గుచ్చాలు, బహుమతులు అందించి, ఆమెను సంతోష పరిచారు. నయనతార తల్లి బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


మరోవైపు విగ్నేష్, నయనతార పెళ్లి ఎప్పుడనే విషయంపై స్పష్టత రాలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పి దాటవేస్తున్న ఈ జంట పెళ్లి ఎప్పుడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. ఇటీవల వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకున్నారని వార్తలు వచ్చాయి.  

PREV
click me!

Recommended Stories

Spider Man Collections: ఇండియాలో ఎండ్‌గేమ్ రికార్డు బ్రేక్, స్పైడర్-మ్యాన్ కలెక్షన్ల సునామీ
Pradeep Rawat: చత్రపతి విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం.. కారణం ఏంటో తెలుసా?