నయనతార పెళ్లి - ముఖ్యమంత్రికి పదవి..లింకేంటి ?

Published : Oct 13, 2018, 03:46 PM IST
నయనతార పెళ్లి - ముఖ్యమంత్రికి పదవి..లింకేంటి ?

సారాంశం

జయాపజయాలతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ నయనతార. అమ్మడు ఎలాంటి సినిమాలు చేసిన మినిమమ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో కొంత ప్రభావం చూపుతాయి.

జయాపజయాలతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ నయనతార. అమ్మడు ఎలాంటి సినిమాలు చేసిన మినిమమ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇక లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చాలా వరకు నయనతారకు కలిసొస్తున్నాయి. 

ప్రస్తుతం కోలీవుడ్ లో నయనకు సంబందించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణముందని కోలీవుడ్ మీడియా ఇష్టం ఉన్నట్టుగా కథనాలను ప్రచారం చేస్తోంది. జయలలిత లానే ముఖ్యమంత్రి కావాలని నయనతార పెళ్లి చేసుకోలేదని చెబుతున్నారు. ఈ టాక్ రావడానికి కారణం లేకపోలేదు. 

తమిళ్ దర్శకుడు జీటీ.నందు ఈ న్యూస్ రావడానికి మొదటి కారణమయ్యాడు. ఇటీవల ఇచ్చిన క ఇంటర్వ్యూలో శింబు - నయనతార ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తావన రాగా ఆయన మాట్లాడుతూ.. వారు విడిపోవడానికి పలు రకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. నాకు తెలిసిన దాని ప్రకారం నేను శింబుకి సన్నిహితుడైన ఒక వ్యక్తి  స్థానిక ట్రిప్లికేన్‌లోని పిళ్లైయార్‌ కోవిల్‌ వీధిలో ఉండే ఒక జ్యోతిష్యుడిని కలిశాం. 

వారి ప్రేమ గురించి చెప్పడంతో అతను జాతకాలు చూసి వివాహం జరిగితే ఆమె నడిరోడ్డున పడే పరిస్థితి వస్తుందని అన్నారు. పెళ్లి చేసుకోకుంటే సీఎం కుర్చీ దక్కే అవకాశం ఉంటుందని ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లు నందు వివరించాడు. దీంతో అప్పటినుంచి నయనతారకు సంబందించిన అనేక వార్తలు మరింత వైరల్ గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?