
నందమూరి నటసింహం బాలకృష్ణతో ముచ్చటగా మూడోసారి జంట కడుతోన్న నయనతార ఆ చిత్రానికి భారీ పారితోషికం డిమాండ్ చేసినట్టు గుసగుసలు ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. బాలయ్య నటించే 102వ చిత్రంలో కథానాయికగా నయనతార ఎంపికైన సంగతి తెలిసిందే. సింహా, శ్రీరామరాజ్యం తర్వాత ఈ కాంబినేషన్‌ని రిపీట్ చేయాలని కె.ఎస్. రవికుమార్ డిసైడ్ అయ్యారు. అయితే తమిళంలో చాలా బిజీగా వుండి, తెలుగు చిత్రాలు సైన్ చేసే తీరిక లేని నయనతార దీంట్లో నటించడానికి మూడు కోట్లు పారితోషికం అడిగిందట.
తెలుగు సినిమాల్లో హీరోయిన్లకి అంత పారితోషికం లేకపోయినా కానీ ఇందులో నయనతార వుండడం తప్పనిసరి అని దర్శకుడు రవికుమార్ పట్టుబట్టడంతో ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారట. మామూలుగా బాలయ్య సినిమాల్లో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు వుంటారు కదా.
ఈ చిత్రానికి సింగిల్ హీరోయిన్ పారితోషికమే కోటలు దాటిపోవడంతో ఇక రెండో హీరోయిన్ క్యారెక్టర్ లేకుండా చేద్దామనుకుంటున్నారట. విశేషం ఏమిటంటే ఇంత పారితోషికం ఇచ్చినా కానీ పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని నయనతార ఖచ్చితంగా చెప్పేసిందట. అయినా సరేనంటూ.. దర్శక నిర్మాతలు నయన్ నే ఈ చిత్రానికి ఫైనల్ చేసారట.