విడుదలకు ముస్తాబవుతున్న నయనతార... 'డోర'

Published : Dec 20, 2016, 01:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
విడుదలకు ముస్తాబవుతున్న నయనతార... 'డోర'

సారాంశం

రిలీజ్ కు రెడీ అవుతున్న నయనతార "డోర" చిత్రం

వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో దాస్ దర్శకత్వంలో ఓ హారర్ చిత్రం తెరకెక్కింది. 'డోర' అనే టైటిల్‌ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.  

 

ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ...  ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార నటిస్తోన్న మరో మహిళా ప్రధాన చిత్రమిది.  ఇప్పటి వరకు వచ్చిన హారర్ సస్పెన్స్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది.  నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ప్రతి సన్నివేశం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠభరింగా సాగుతుంది. మా సంస్థలో నవ్యతతో కూడిన వినూత్న కథా చిత్రాల్ని రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకు ముస్తాబవుతున్నఈ చిత్ర ఆడియో వేడుకను నూతన సంవత్సరం.. జనవరిలో జరిపి, ఫిబ్రవరి లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము..అన్నారు. 

 

ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?