'పిట్టగోడ' చిత్రానికి క్లీన్‌ 'యు' - డిసెంబర్‌ 24 విడుదల

Published : Dec 20, 2016, 01:38 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
'పిట్టగోడ' చిత్రానికి క్లీన్‌ 'యు' - డిసెంబర్‌ 24 విడుదల

సారాంశం

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'పిట్టగోడ'కు యు సర్టిఫికేట్

విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'పిట్టగోడ'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది.

 

మంచి కథ, కథనాలతో క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మంచి ఫీల్‌ వుందని, మ్యూజికల్‌గా కూడా చాలా బాగుందని సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 24న విడుదల చేస్తున్నారు.

 

విశ్వదేవ్‌ రాచకొండ హీరోగా, పునర్నవి భూపాలం హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఉయ్యాలా జంపాలా రాజు, జబర్దస్త్‌ రాజు, శివ ఆర్‌.ఎస్‌., శ్రీకాంత్‌ ఆర్‌.ఎన్‌. ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

 

ఈ చిత్రానికి సంగీతం: 'ప్రాణం' కమలాకర్‌, నిర్మాతలు: దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి., దర్శకత్వం: అనుదీప్‌ కె.వి. 

 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద