లవ్ స్టోరీతో వివాదాలు.. ఇకపై అన్నీ అబద్ధాలే అంటోన్న హీరో!

Published : Oct 03, 2018, 02:51 PM IST
లవ్ స్టోరీతో వివాదాలు.. ఇకపై అన్నీ అబద్ధాలే అంటోన్న హీరో!

సారాంశం

'An ordinary life'అనే పేరుతో గతేడాది తన ఆత్మకథను రాసుకున్నాడు హీరో నవజుద్దీన్ సిద్దిఖి. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఈ నటుడు చిన్న పట్టాలన నుండి వచ్చేవారికి ప్రేరణగా నిలవాలనే ఉద్దేశంతో తన లైఫ్ స్టోరీని పుస్తక రూపంలో ఆవిష్కరించాడు. 

మొత్తం 209పేజీలు  గల ఈ పుస్తకంలో 5 పేజీలు తన మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్, సునీత రాజవర్ లతో సాగించిన లవ్ స్టోరీల గురించి చెప్పాడు. అయితే ఈ విషయంపై సదరు ఇద్దరు అమ్మాయిలు స్పందించి తమ గురించి పుస్తకంలో తప్పుగా రాశాడని ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో ఈ పుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు గతేడాది అక్టోబర్ లో ప్రకటించారు.

ఈ వివాదం జరిగి సరిగ్గా ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా నవాజుద్ధీన్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ''పుస్తకంలో 209 పేజీలు ఉన్నాయి. కేవలం 5 పేజీల కారణంగా నా ప్రయత్నాన్ని వృధా చేస్తారా..? నా ప్రేమకథను బయటపెట్టినందుకు వివాదం చెలరేగుతుందని ఊహించలేదు.

నిజాలు చెప్పాలని మాత్రమే అనుకున్నానని'' అన్నారు. ఇకపై తన జీవిత చరిత్రతో పుస్తకాలు రాస్తే అందులో అబద్ధాలే ఉంటాయని వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌