నవీన్ పోలిశెట్టి యుఎస్ నుంచి ఎందుకు రావడం లేదు.. సినిమాల సంగతేంటి ?

Published : Jul 11, 2024, 09:51 PM IST
నవీన్ పోలిశెట్టి యుఎస్ నుంచి ఎందుకు రావడం లేదు.. సినిమాల సంగతేంటి ?

సారాంశం

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి పేరు చెప్పగానే జాతిరత్నాలు చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి హిట్స్ సొంతం చేసుకున్నాడు.

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి పేరు చెప్పగానే జాతిరత్నాలు చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి హిట్స్ సొంతం చేసుకున్నాడు. సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, నిఖిల్ తరహాలో నవీన్ పోలిశెట్టి కూడా యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. 

యువహీరోలు వెంట వెంటనే సినిమాలు చేసేస్తున్నారు. కానీ నవీన్ మాత్రం వెనుకబడ్డాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం విడుదలైన తర్వాత ఇంతవరకు నవీన్ తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు. గత ఏడాది నవీన్ యుఎస్ కి వెళ్ళాడు. అక్కడ చిన్న బైక్ యాక్సిడెంట్ జరిగింది. కోలుకుని 2023 ఏడాది ఎండింగ్ కే ఇండియా వచ్చేస్తాడు అని ప్రచారం జరిగింది. 

కానీ నవీన్ ఇంతవరకు ఇండియా రాలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి నవీన్ ఓ చిత్రం చేయాల్సి ఉంది. కానీ కథ కుదరడం లేదట. నవీన్ కి ఏ కథలు ఒక పట్టాన నచ్చవని సన్నిహితులు చెబుతుంటారు. అంతా పర్ఫెక్ట్ అనుకుంటేనే ఓకె చేస్తాడట. 

ఇటీవల కొందరు డైరెక్టర్లు చెప్పిన కథలేవి నవీన్ కి నచ్చలేదని సమాచారం. మరి నవీన్ పోలిశెట్టి ఇండియా ఎప్పుడు వస్తాడో.. సినిమాలపై కంప్లీట్ గా ఎప్పుడు ఫోకస్ చేస్తాడో తెలియని పరిస్థితి. 

PREV
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే