హరిహర వీరమల్లు నిర్మాత ఇంట్లో సెలెబ్రేషన్స్..ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ, కారణం ఇదే

Published : Jul 11, 2024, 06:24 PM IST
హరిహర వీరమల్లు నిర్మాత ఇంట్లో సెలెబ్రేషన్స్..ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ, కారణం ఇదే

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ జరిగింది. కానీ మూవీ ఆలస్యం అవుతుండడంతో క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. 

దీనితో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ డేట్లు ఇస్తే మిగిలిన భాగం షూటింగ్ పూర్తవుతుంది. ఇదిలా ఉండగా ఏఎం రత్నం ఫ్యామిలీ ప్రస్తుతం సంబరాల్లో ఉంది. జ్యోతి కృష్ణ, ఐశ్వర్య దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. జ్యోతి కృష్ణ సతీమణి ఐశ్వర్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారని ఏఎం రత్నం ఫ్యామిలీ ఓ ప్రకటనలో తెలిపారు. 

ఏఎం రత్నంకి ఇద్దరు తనయులు. జ్యోతి కృష్ణ తో పాటు రవికృష్ణ ఉన్నారు. 7 జి బృందావన కాలనీ చిత్రంలో రవికృష్ణ హీరోగా నటించారు. ఆ తర్వాత రవికృష్ణ కెరీర్ సాగలేదు. తమ ఇంట్లో తొలిసారి అమ్మాయి పుట్టడంతో ఏఎం రత్నం ఇతర కుటుంబ సభ్యులంతా మహాలక్ష్మి పుట్టింది అని మురిసిపోతూ సంబరాలు చేసుకుంటున్నారు. 

జ్యోతి కృష్ణ..గోపీచంద్ ఆక్సిజన్, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు పవన్ తో హరి హర వీరమల్లు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్