టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూయిస్తారు. అయితే ఏకంగా మంత్రి మల్లారెడ్డినే ట్రోల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన మాటలు వైరల్ గా మారాయి.
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) తదుపరి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. అనుష్క శెట్టి (Anushka Shetty)తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ‘జాతిరత్నాలు’ చిత్రంతో చివరిగా అలరించారు. దాంతర్వాత కాస్తా గ్యాప్ ఇచ్చి Miss Shetty Mister Polishettyతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది.
ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. దీంతో యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నవిషయం తెలిసిందే. అలాగే ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించారు. ముఖ్యంగా సినిమాను నవీన్ పొలిశెట్టినే ప్రమోట్ చేసే బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి తాజాగా మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) స్థాపించిన CMR Collageకు ప్రమోషన్స్ కోసం వెళ్లారు. అక్కడ నవీన్ ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారింది.
నవీన్ మాట్లాడుతూ.. ‘మీ పెద్దాయన మల్లారెడ్డి సార్ ఉంటారనుకుని వచ్చా. ఆయన స్టైల్, స్పీచ్ అంటే నాకు బాగా ఇష్టం’ అని పొగిడారు. ఆ తర్వాత మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్ ‘పాలమ్మినా.. పూలమ్మినా’ను తన స్టైల్లో చెప్పి ఆకట్టుకున్నారు. ‘కష్టపడ్డా, ఇన్ని హిట్లు ఏడికెళ్లొచ్చినయ్.. ఎట్లోచ్చినయ్.. నేనేమైన మాయ చేసిన్నా, మంత్రం చేసినానా, స్కిట్లు రాశిన, యూట్యూబ్ లో వీడియోలు జేశిన, ఇప్పుడు అనుష్కతో హీరోగా జేసిన.. సక్సెస్ అయినా’ అంటూ స్పీచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ స్పీచ్ వైరల్ గా మారింది.
కామెడీ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రం నుంచి వరుసగా అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ప్రమోషన్స్ ను కూడా ఆసక్తికరంగా చేస్తుండటంతో సినిమాపై హైప్ పెరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. చిత్రానికి సినిమాటోగ్రఫీగా నీరవ్ షా, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం రధన్ అందిస్తున్నారు. నిర్మాత వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు.