‘సామజవరగమన’ OTT రిలీజ్ డేట్..అంత త్వరగానా?

Published : Jul 12, 2023, 01:16 PM ISTUpdated : Jul 12, 2023, 01:18 PM IST
 ‘సామజవరగమన’ OTT రిలీజ్ డేట్..అంత త్వరగానా?

సారాంశం

  ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లోనే ఏకంగా రూ.40 కోట్లకు పైన కలెక్షన్స్ అందుకుని నిర్మాతలకు మూడింతల లాభాన్ని తెచ్చిపెట్టింది. 


ఓ సినిమా హిట్ అయ్యిందంటే ఇంతకు ముందు థియేటర్ కు వెళ్లి ఎప్పుడు చూద్దామా అన్నట్లు ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు ఓటిటిలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులు మొదలెట్టారు. కామెడీని వదిలేసి మాస్ వైపుకు వచ్చిన   శ్రీవిష్ణు కు ఈ మధ్య సరైన హిట్ లేదు.  ‘రాజ రాజ చోర’ తర్వాత ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి ప్లాప్ లు పడ్డాక అతను హీరోగా వచ్చిన చిత్రం ‘సామజవరగమన’. కామెడీ చిత్రం కావటంతో   ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు కావటం కూడా ప్లస్ అయ్యింది సామజవరగమన జూన్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి టాక్‌తో స్క్రీనింగ్‌ అవుతూ.. శ్రీవిష్ణు టీంలో జోష్‌ నింపుతోంది.   ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లోనే ఏకంగా రూ.40 కోట్లకు పైన కలెక్షన్స్ అందుకుని నిర్మాతలకు మూడింతల లాభాన్ని తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ గురించి టాపిక్ మొదలైంది. 

అందుతున్న సమాచారం మేరకు...  ఈ బాక్సాఫీస్  బ్లాక్ బస్టర్ హిట్  సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్స్ లో విడుదలై నెలరోజులు అవ్వకముందే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోందని సమాచారం. 'సామజవరగమన' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే జూలై 22న నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో 'సామజవరగమన' రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎగ్రిమెంట్ మొదటే జరిగిందని , అందుకే అంత త్వరగా ఓటిటిలో రాబోతోందని వినికిడి. 
    
 ఈ చిత్రంలో బిగిల్‌ (విజిల్‌) ఫేం రెబా మోనికా జాన్‌ (Reba Monica John) ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషించింది. సుదర్శన్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, వెన్నెల కిశోర్‌, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌, ప్రియ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై రాజేశ్‌ దండా నిర్మించారు. సినిమాల గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేయని రవితేజ మొదటిసారి సామజవరగమన చిత్రం గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేయడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా వైరల్ గా మారింది. చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నానని ఆయన చెప్పడం నిజంగా ఆ టీం కి కొత్త బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. 
  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా