ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ పై కుర్రహీరో సెన్సేషనల్ కామెంట్స్!

Published : Feb 14, 2019, 11:37 AM ISTUpdated : Feb 14, 2019, 11:47 AM IST
ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ పై కుర్రహీరో సెన్సేషనల్ కామెంట్స్!

సారాంశం

యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన 'హీరో హీరోయిన్' సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మా ఎన్టీఆర్ సినిమానే పైరసీ చేస్తావా అంటూ హీరో చొక్కా పట్టుకుంటారు ఫ్యాన్స్. 

యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన 'హీరో హీరోయిన్' సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మా ఎన్టీఆర్ సినిమానే పైరసీ చేస్తావా అంటూ హీరో చొక్కా పట్టుకుంటారు ఫ్యాన్స్. దానికి హీరో నెక్స్ట్ వీక్ రామ్ చరణ్ సినిమా రిలీజవుతుంది.. ఇంకా ఎక్కువ పైరసీ చేస్తా అంటాడు.

వెంటనే తారక్ ఫ్యాన్స్ హీరోని మెచ్చుకుంటూ తమవాడిలా చూస్తారు. టీజర్ లో ఈ వివాదాస్పద సన్నివేశంపై హీరో నవీన్ స్పందించాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల్లో అలాంటివాళ్లు చాలా మంది ఉన్నారంటున్నాడు నవీన్ చంద్ర.

ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టే ఉద్దేశం తమకు లేదని, అలాంటివాళ్లు కూడా ఉన్నారని చెప్పడం కోసమే ఆ సీన్ పెట్టినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అభిమానుల మధ్య జరుగుతున్నదే చూపించామని, అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నాడు.

ఎన్టీఆర్, చరణ్ కలిసి సినిమా చేస్తారనే విషయం యూనిట్ కి తెలియదని, RRR సినిమా సెట్ కాక ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లు తెలిపారు. ఈ టీజర్ పై ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో తనకు తెలియదని కానీ తాము మాత్రం అవాస్తవాలు చెప్పలేదని స్పష్టం చేశాడు. 

'ఛాన్స్ దొరికితే మేం కుక్కలమే..' హీరో కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం