
ప్రస్తుతం నాని మూడు సినిమాలు చేయబోతున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘నిన్ను కోరి' అనే సినిమాలో చేస్తున్నాడు నాని. ఆ తర్వాత దిల్ రాజు సినిమా అంగీకరించాడు అన్న వార్తలు వస్తున్నాయి.
ఇది పూర్తయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నాడు.
ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యాక నాని ‘బాహుబలి' నిర్మాతల బ్యానర్లో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు అన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈసినిమాకు సంబంధించి నానీకి బాహుబలి నిర్మాతలు అత్యధిక పారితోషికం ఇవ్వబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి.