"చెలియా" మూవీ రివ్యూ

Published : Apr 07, 2017, 04:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
"చెలియా" మూవీ రివ్యూ

సారాంశం

ఆక‌ట్టుకునే ఫ‌స్ట్  హాఫ్‌ బోర్ కొట్టించే సెకండాఫ్‌  50-50 టాక్ తెచ్చుకున్న చెలియా దర్శకత్వం- మణిరత్నం నిర్మాత- దిల్ రాజు

కథ :

వరుణ్(కార్తి) ఫైటర్ ఫైలెట్ గా బోర్డర్ లో పనిచేస్తుంటాడు. తన మాటే సాహసనంగా నడుకుచుకోవాలనుకునే వరుణ్ ఓ యాక్సిడెంట్ కారణంగా లీలా (అదితి రావు హైదరి)ని కలుసుకుంటాడు. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిన వరుణ్ ఆమెకు సర్ ప్రైజ్ లు ఎన్నో ఇస్తాడు. తను చూడని ప్రదేశాలను చూపిస్తూ ఆమెను కూడా తన ప్రేమలో పడేసేలా చేసుకుంటాడు. స్వతహాగా డాక్టర్ అయిన లీలా, వరుణ్ చెప్పిన ప్రతి విషయానికి వాదిస్తుంటుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా వారిద్దరి మధ్య గొడవలు అవుతుంటాయి. కడుపులో పెరుగుతున్న బిడ్డ వద్దని చెప్పడంతో అతనికి దూరమవుతుంది లీలా. అలాంటి సమయంలోనే వచ్చిన ఒక యుద్ధ వాతావరణంతో వరుణ్ పాకిస్తా జైల్లో బందీ అవుతాడు. అలా పాకిస్థాన్ చేతిలో బందీ అయిన కార్తి ఎలా తప్పించుకున్నాడు ? చివరికి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? అనేదే ఈ సినిమా.

 

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్ అంటే రవి వర్మ అందించిన సినిమాటోగ్రఫీ అనొచ్చు. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి విజువల్ అద్భుతంగా అనిపించింది. కాశ్మీర్, లడక్ లొకేషన్లలో తీసిన సన్నివేశాలను, హీరో హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలను చాలా బాగా చూపించారు. వరుణ్ గా కార్తి అదరగొట్టేశాడు. క్యారక్టరైజేషన్ మార్క్ యాటిట్యూడ్ చూపిస్తూ మరో పక్క ప్రేమ చూపించే సమయంలో కార్తి చాలా మెచ్యురెడ్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. కచ్చితంగా ఈ సినిమాలో ఓ కొత్త కార్తిని చూడొచ్చు.అదితిరావ్ హైదరి ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి మంచి ఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి. మణిరత్నం ఆమెను ఇదివరకెన్నడూ చూడనంత అందంగా చూపించాడు. అదిరిరావ్ తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకి మంచి బలంగా నిలిచింది. ఫస్టాఫ్ అంతా మంచి రొమాన్స్, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ, ఆకట్టుకునే డ్రామాతో నిండి మణిరత్నం స్టైల్లో ఉంది.ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి మరొక ప్లస్ పాయింట్. హీరో హీరోయిన్ల మధ్య మంచి ఎమోషనల్ కెమిస్ట్రీ క్లైమాక్స్ లో బాగా వర్కవుట్ అయింది.

 

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ అంతా బాగా నడిపిన మణిరత్నం సెకండాఫ్ కు వచ్చే సరికి రొమాంటిక్ డ్రామాను బాగా నెమ్మదిగా తయారుచేశారు. అందులోని ప్రతి సీన్ స్లోగానే నడిచింది. ఇది కొన్ని వర్గాల ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. సెకండాఫ్లో కార్తి పాత్ర చిత్రీకరణ కాస్త తడబడినట్లు అనిపించింది. అతను ప్రేమ నుండి ఎందుకు తప్పించుకోవాలనుకుంటాడు అనే అంశాన్ని వివరంగా చూపలేదు. ఎడిటింగ్ ఓకే కాని సెకండ్ హాఫ్ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. కథ కథనాల్లో క్లారిటీ ఇంకా చెప్పాలంటే కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది.

 

సాంకేతిక విభాగం :

చెలియా సినిమాతో మణిరత్నం మరోసారి తన మార్క్ చూపించుకున్నాడు. ప్రతి ఫ్రేం ఎంతో నీట్ గా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా లొకేషన్స్ విషయంలో సినిమా కన్నుల పండుగగా ఉంటుంది. మణిరత్నం తన మార్క్ చూపించడంలో ఎక్కడ తగ్గలేదు. ఒక ప్రత్యేకమైన బ్యాక్ డ్రాప్లో తీసిన విజువల్స్, హీరో హీరోయిన్ల రొమాంటిక్ కాన్వర్జేషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

 

తీర్పు :

 
సినిమా మొదటి భాగం మంచి ప్రేమ కథగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో వారి మధ్య గొడవలను సరిగా చూపించలేకపోయాడు. ఇక సెకండ్ హాఫ్ ల్యాగ్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా నడిపించారు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాలు చూసే ప్రేక్షకులు కచ్చితంగా ఈ సినిమా నచ్చే అవకాశం లేదు. సినిమాలో చెప్పదలచుకున్న పాయింట్ సాగదీసినట్టు అనిపిస్తుంది. రొటీన్ కథే అయినా మణిరత్నం మార్క్ తో మొదటి భాగం కాస్త పర్వాలేదు అన్నట్టు ఉంటుంద..సాగదీయబడినట్టు ఉండే సెకండాఫ్ ప్రధాన బలహీనత. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రం నెమ్మదైన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాను ఇష్టపడే వారికి బాగుంటుంది కానీ మిగిలిన ప్రేక్షకులకు యావరేజ్ చిత్రంగానే అనిపిస్తుంది.
 
రేటింగ్ - 2.5 5
ఫైన‌ల్ లైన్ - స్లోగా సాగే ప్రేమ క‌థ‌

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి