సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న నాని, నేచురల్ స్టార్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా..?

Published : Jul 11, 2023, 06:26 PM ISTUpdated : Jul 11, 2023, 06:28 PM IST
సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న నాని,  నేచురల్ స్టార్ ఫార్ములా  వర్కౌట్ అవుతుందా..?

సారాంశం

దసరా సినిమాతో సక్సెస్ కొట్టి హిట్  ట్రాక్ లోకి వచ్చాడు నేచురల్ స్టార్ నాని. ఆ సినిమా నాని కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. అయితే ఇదిలా ఉండగా.. ఈ మధ్య నాని ఓ సెంటిమెంట్ ను బాగా ఫాలో అవుతున్నట్టుగాతెలుస్తోంది. 

చాలా మంది హీరోలకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. కొంత మంది హీరోలకు హిట్ కోసం ఏదో ఒక కామన్ పాయింట్ ను కలిసివచ్చింది కదా అని సెంటిమెంట్ గా వాడుతుంటారు.. మరికొంత మంది  మాత్రం హిట్టు ప్లాప్ సంబంధం లేకుండా ఓ సెంటి మెంట్ పాయింట్ తమ సినిమాలో కనిపించేలా చేస్తుంటారు. అలాంటిసెంటిమెంట్ ఒక దాన్నే ఫాలో అవుతున్నాడు నేచురల్ స్టార్ నానీ. ఈమధ్య తన సినిమాల్లో కామన్ గా ఓ పాయింట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది అదేమిటంటే..? 

దసరా సినిమాతో సక్సెస్ కొట్టి హిట్  ట్రాక్ లోకి వచ్చాడు నేచురల్ స్టార్ నాని. ఆ సినిమా నాని కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. అయితే ఇదిలా ఉండగా.. ఈ మధ్య నాని ఓ సెంటిమెంట్ ను బాగా ఫాలో అవుతున్నట్టుగాతెలుస్తోంది. తను  నటించే సినిమాల్లో ఎవరో ఒక హీరోని  అతిధి పాత్రలో లేదా ముఖ్య పాత్రలోకి తీసుకుంటున్నారు. అది కూడా నానీ సెంటిమెంట్ కోసమే..మేకర్స్ ఇలా చేస్తున్నట్టు సమాచారం. 

అయితే గత కొంత కాలంగా నానీసినిమాల్లో.. ఇలా సెకండ్ హీరోలు  కనిపిస్తుండటం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా జెర్సీ లో హరీష్ కళ్యాణ్ నటించగా.. నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించాడు. ఇక వి సినిమాలో సుధీర్ బాబు, టక్ జగదీష్ సినిమాలో తిరువీర్ , శ్యామ్ సింగ రాయ్ సినిమాలో  రాహుల్ రవీంద్రన్  నటించగా.. రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ సినిమా దసరాలో సినిమాలో దీక్షిత్ శెట్టి నటించి మెప్పించాడు. 

ఇలా వరుసగా తన సినిమాలో.. మరో యంగ్ హీరో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట స్టార్ హీరో.. ఈక్రమంలో.. నాని నటిస్తున్న 30వ సినిమాలో కూడా ఈ సెంటిమెంట్ ను ఫాలో అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసినిమాలో నానీతో కలిసి నటించబోతున్నది ఎవరో కాదు  హీరో విరాజ్  అశ్విన్ అని తెలుస్త్ంది. నాని 30  వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాతో  శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై జమోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్  ఈ సినిమాని  చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?