నేచురల్ స్టార్ నాని (Nani)కి, ఆయన ఫ్యాన్స్ కు ఈరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈరోజు నాని పుట్టిన రోజు కావడం విశేషం. అయితే, తన బర్త్ డే రోజున నాని తాజాగా ఓ ఇంట్రెస్టింట్ పోస్టును పెట్టారు.
రంగుల ప్రపంచంలో ఎదగాలన్న.. హీరోగా మంచి గుర్తింపు దక్కాలన్నా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కనీసం ఇండస్ట్రీ పెద్దల సపోర్ట్ అయినా కావాల్సిదేనన్నది తెలిసిన విషయం. కానీ నేచురల్ స్టార్ నాని టాలెంట్ ఉంటే సరిపోతుందని నిరూపించారు. ఎవరి పేరు చెప్పకుండా టాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు అగ్రహీరోల్లో ఒకరిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక నానికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కాస్తా ఎక్కువే. ఈరోజు నాని పుట్టిన రోజు కావడంతో అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో నానిని అభిమానించే వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా నానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన మరిన్ని పుట్టిన రోజులను ఇలాగే, సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. నెట్టింట నానికి బర్త్ డే విషెస్ చెబుతూ మోతమోగిస్తున్నారు. ఈ క్రమంలో నాని అందరికీ థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్ట్ పెట్టారు. దానికి తోడుగా అదిరిపోయే నోట్ కూడా రాసుకొచ్చారు. ప్రతి శుక్రవారం ‘సినిమాలు’ రిలీజ్ అవుతున్న తరుణంలో తానూ శుక్రవారమే రిలీజ్ అయ్యానంటూ ఇంట్రెస్టింగ్ గా కామెంట్ చేశారు.
ఆ నోట్ లో..‘నేనూ 1984, ఫిబ్రవరి 24న.. అది కూడా శుక్రవారమే రిలీజ్ అయ్యాను. గత 15 ఏండ్లుగా మళ్లీ మళ్లీ ఇలా శుక్రవారం రోజున పుడుతూనే ఉన్నారు. ఇక ఈ శుక్రవారం కూడా అందరీ ప్రేమాభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే మరెన్నో వేడుకలు జరుపుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను.’ అంటూ ఆసక్తికరంగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం నాని నటించిన ‘దసరా’ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే ‘నాని30’వ చిత్రం కూడా సెట్స్ పైకి వెళ్లింది.