అలనాటి నటుడు రావు గోపాలరావు నటవారసుడిగా రావు రమేశ్ (Rao Ramesh) తనదైన ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. తన కేరీర్ లో ఎన్నో పాత్రలు పోషించినాయన తొలిసారి హీరోగా అలరించబోతున్నాడు.
విలక్షణ నటుడు, అలనాటి సీనియర్ నటుడు రావు గోపాల్ రావు కొడుకుగా రావు రమేష్ టాలీవుడ్ లో మంచిగుర్తింపు దక్కించుకున్నారు. తండ్రికి తగ్గ తనయగా ప్రశంసలు పొందారు. సినీ ఇండస్ట్రీలోకి కాస్తా ఆలస్యంగానే ఎంట్రీ ఇచ్చారు రావు రమేశ్. అనేక చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు ఆయన. ఏసినిమాలోనైనా సినిమాలోనైనా తన మార్క్ కనిపించేలా జీవిస్తారు. ‘కొత్తబంగారు లోకం చిత్రం’తో సెన్సేషన్ గా మారిన ఆయన ఇప్పటి వరకు అద్భుతమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక రావు తనలోని మరో కోణాన్ని కూడా పరిచయం చేయబోతున్నారు. ఇన్నేళ్ల సినీజీవితంలో రావురమేశ్ తొలిసారి హీరోగా అలరించబోతున్నాడు.
కథలో ముందుండి, కథను ముందుకు నడిపించే నాయకుడిని కథానాయకుడు అంటారు. విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారి ఆ నాయకుడిగా ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అవుతున్నారు. ఆయన పోషించబోయేది రెగ్యులర్ హీరో రోల్ కాదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ సినిమాలను ఆదరిస్తున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి యాక్టర్స్ చేసే సినిమాల తరహాలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక 56 ఏండ్ల వయస్సులో రావు రమేశ్ ఇలా ప్రయోగం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
రావు రమేష్ టైటిల్ పాత్రలో పీబీఆర్ సినిమాస్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందిస్తున్న సినిమా 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ 'పుష్ప', 'కెజియఫ్', 'ధమాకా' తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న చిత్రమిది. ఇందులో నటి ఇంద్రజ కీలక పాత్రధారి. 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రోజు సినిమాను అధికారికంగా ప్రకటించారు. చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ ''వినోదాత్మక కుటుంబ కథా చిత్రమన్నారు. రావు రమేష్ లీడ్ రోల్ చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం'' అని చెప్పారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. చిత్రంలో సీనియర్ నటి ఇంద్రజా కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది.
A fresh & Super Fun😀
Family entertainer is coming your way to tickle your funny bones😉
Everyone’s favourite garu& are teaming up for a crazy entertainer,Titled !
Shoot commences from March🎥 pic.twitter.com/BspYnguIk7