
ఈరోజు ఎపిసోడ్ లో నందు రెడీ అవుతూ ఉండగా అప్పుడు లాస్య ఎక్కడికి వెళ్తున్నావు అనడంతో ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు అనగా ఈ మధ్య నీకు కోపం ఎక్కువ అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకో అని అంటాడు నందు. బయటికి వెళ్దాం నందు బోర్ కొడుతోంది అనడంతో నేను తులసి వేరే పని మీద బయటకు వెళ్తున్నామని చెప్పి నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నందు అందరికీ కొత్త బట్టలు తీసుకుని రావడంతో అవి చూసి లాస్య ఇవన్నీ నా కోసమేనా అని సంతోషపడుతుండగా ఇవి నీకు కాదు ఇంట్లో వాళ్లకి అని అంటాడు. అప్పుడు సందర్భం ఏమీ లేదు నాన్న నేను సంతోషంగా ఉన్నాను అందుకే తీసుకువచ్చాను అనడంతో పరంధామయ్య సరే అని అంటాడు.
బట్టలు తీసుకుని వచ్చాను ఎవరు కాదనద్దు అంటూ అందరికీ బట్టలు ఇస్తాడు. అప్పుడు అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు నందు తులసివైపు చూస్తూ ప్లీజ్ అని అనగా బట్టలు ఇస్తుండగా తులసి అలాగే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరూ తీసుకోండి ఆంటీ లేకపోతే మేము కూడా తిరిగిచ్చేస్తాము అనడంతో తులసి నందు తెచ్చిన బట్టలు చేసుకుంటుంది. అప్పుడు తులసి మనసులో పాతికేళ్ల కాపురంలో ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత కొని పెడుతున్నారు అనుకుంటూ నవ్వుతూ ఆ చీరను తీసుకుంటుంది.
అప్పుడు అందరికీ తెచ్చావు మీ ఇద్దరికీ అని పరంధామయ్య అనడంతో లాస్యకి నా సెలెక్షన్ నచ్చదు అందుకే తనకు డబ్బులు ఇస్తున్నాను అని డబ్బులు ఇవ్వగా అది చూసి లాస్య సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడు తులసి సందర్భంగా సిటీలో మరొక రెండు బ్రాంచ్ లు ఏర్పాటు చేస్తున్నాము అనడంతో అందరూ సంతోషపడతారు. పార్టీ ఇవ్వాలి అనడంతో ఏమేం కావాలో అడగండి అని నందు అడగగా లాస్య నాకు నెక్లెస్ కావాలి అనడంతో అవన్నీ కాదు ముందు మీ కారు బ్యాంకు వాళ్ళ దగ్గర ఉంది కదా దాన్ని రిటర్న్ తెచ్చుకోండి అని అంటుంది.
అప్పుడు నందు ఈ రోజు నైట్ మీకు ట్రీట్ ఇవ్వబోతున్నాను రెడీగా ఉండండి అనడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత నందు పని చేసుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ రావడంతో నందు మాట్లాడుతూ ఉంటాడు. మా ఫ్రెండ్ బిజీగా ఉంటే చూద్దామని వచ్చాను అనడంతో అవునా అని సంతోషపడుతూ ఉంటాడు నందు. మా వాళ్ళందరూ నా వెనక నిలబడ్డాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు నందు. అసలు ఏం చేయలేను అనుకుంటున్న సమయంలో నాకు ఐడియా చ్చిన కేఫ్ పెట్టమని సలహా ఇచ్చింది అని నందు అనగా డివర్స్ ఇచ్చిన భార్యలు మామూలుగా కోపంతో ఉంటారు కానీ ఇలా చేస్తోంది అంటే తన గ్రేట్ అంటూ నందు వాళ్ళ ఫ్రెండ్ తులసి గురించి పొగుడుతూ ఉంటాడు.
చాలా అదృష్టవంతుడు నందు అనడంతో నందు సంతోషపడుతూ ఉంటాడు. నేను తులసి కోసం ఏం చేయకపోయినప్పటికీ తులసి మాత్రం నాకు అండగా నిలబడింది తనది చాలా గొప్ప మనసు అని పొగుడుతూ ఉంటాడు నందు. అప్పుడంటే ఏమి ఇవ్వలేకపోతున్నావు మరి ఇప్పుడు ఏమి ఇస్తావు అనడంతో అప్పుడు నందు తన జోబీలో ఉన్న గోల్డ్ నెక్లెస్ చూపించి ఇది తులసి కోసం తీసుకున్నాను అని అంటాడు. ఇది నేను తులసికి మాజీ భర్తగా ఇవ్వలేదు నా కేఫె స్టార్ట్ చేసినందుకు ఒక ఫ్రెండ్ గా ఇస్తున్నాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తులసిని ఇంకొకసారి ఎప్పుడూ అవమానించద్దు బాధ పెట్టొద్దు అలా చేసావంటే నీకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడు నందు ఆ నెక్లెస్ వైపు చూస్తూ ఉంటాడు. తర్వాత తులసి కేఫ్ ని డెకరేషన్ గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి అనసూయ పరంధామయ్య వస్తారు. ఇప్పుడు ఏం స్పెషల్ ఉంది తులసి అనడంతో ప్రేమికుల రోజు ఆరోజున ప్రేమికులు ఎక్కువ మొత్తంలో వస్తారు అందుకే ఇలా డెకరేట్ చేస్తున్నాను అని అంటుంది తులసి. అప్పుడు కేఫ్ లో అందరూ ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తే మన కేఫ్ కి కావాల్సిన పబ్లిసిటీ కూడా వస్తుంది అని అంటుంది శృతి. ఇంతలో నందు అక్కడికి రావడంతో మీకు చెప్పకుండా ప్లాన్ చేశాను ఏమనుకోవద్దు అని అంటుంది. ఇప్పుడు నందు నువ్వేం టెన్షన్ పడకు నువ్వు ముందున్నావ్ అన్న ధైర్యంతోనే మేము వెనకాల వస్తున్నాము అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి లాస్య వస్తుంది.
నీ ఆలోచన కరెక్టే తులసి కేఫ్ ఓనర్ నందు ఏ విషయంలో అయినా కచ్చితంగా నందు సహాయము తీసుకోవాల్సిందే అని అంటుంది. అప్పుడు ఇదంతా జరగడానికి కారణం ఎవరు అమ్మనే కదా అంటూ తులసిని పొగుడుతూ ఉంటాడు ప్రేమ్. ఇలా ప్రతి ఒక్క దాంట్లో అమ్మ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుండగా నువ్వు ఏం చేశావని సలహా తీసుకోవాలి ఎందుకు మధ్యలో కాలు అడ్డు పెడతావు అంటూ లాస్య. అప్పుడు నందు లాస్య మాటలు పట్టించుకోవద్దని తన ఏదో క్యాజువల్ గా ఉంది అనడంతో లేదు నేను సీరియస్ గానే అన్నాను అని అంటుంది లాస్య. నందు కేఫ్ ఓనర్ కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా నందుకు చెప్పి జరగాలి అని అంటుంది లాస్య.
అందరూ కలిసి నందుని పిచ్చివాన్ని చేయాలని చూస్తున్నారా అనడంతో వాళ్లు అనలేదు కదా లాస్య అనడంతో అదే నందు వాళ్ళు అంటున్నది నీకు అర్థం కావడం లేదు అంటుంది లాస్య. లాస్య కావాలనే రచ్చ రచ్చ చేస్తుండగా ప్రేమ్ సారీ చెప్పు అని తెలిసి అనడంతో అది డిసైడ్ చేయాల్సింది నేను అని అంటాడు నందు. అప్పుడు తులసికి సపోర్ట్ గా నందు మాట్లాడడంతో లాస్య షాక్ అవుతుంది. నువ్వు ఏదైనా ప్లాన్ చేయాలి చెప్పాలి అనుకుంటే చెప్పు కానీ కంప్లైంట్స్ ఇవ్వకు అంటాడు నందు. అప్పుడు పరంధామయ్య జోకులు వేయడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు.
తర్వాత అభి ఇంట్లో అందర్నీ ఒప్పించాను ఆంటీ జర్నీ ఖర్చులకు ఒకటి మీరు డబ్బులు ఇవ్వండి అని మాట్లాడుతూ ఉండగా ఇందులో తులసి అక్కడికి రావడంతో అభి షాక్ అవుతాడు. అప్పుడు తులసి నువ్వు ఎదుగుతున్నావని సంతోషపడ్డాను కానీ ఇంత దిగజారి పోతావు అని అనుకోలేదు నీ డబ్బులతో అంకితని అమెరికాకు తీసుకెళుతున్నాను అని చెప్పి నీ అత్తగారి దగ్గర డబ్బుల కోసం చేతులు చేస్తావా అని అంటుంది తులసి. అప్పుడు అభి నా డబ్బులతోనే తీసుకెళ్తున్నాను అనడంతో అబద్ధం మీ అత్తగారు ఇచ్చే బిక్షతో వెళ్తున్నావు అంటుంది తులసి.
అత్తగారు నిన్ను డబ్బులతో కొంటుంది నీకు ఆ విషయం అర్థం కావడం లేదు అని అంటుంది తులసి. నేను ఊరికినే ఏం తీసుకోలేదు డబ్బులు అప్పుగా తీసుకుంటున్నాను అనడంతో ఆ విషయం అంకితకు నచ్చదని తెలుసు ఆ విషయం తెలిసిన రోజు ఏమవుతుందో తెలుసా అనడంతో నువ్వు చెప్తే గాని తెలియదు కానీ నువ్వే మా మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నావు అంటూ తులసి నిందిస్తాడు అభి. అప్పుడు తులసి అభికి జాగ్రత్తలు చెప్పగా అప్పుడు అభి మాత్రం తులసిని తప్పుగా అపార్థం చేసుకుంటాడు.