నిర్మాత సురేష్ బాబు, హీరో రానాలపై పోలీసు కేసు నమోదు.. కోర్టు ఆదేశాలతో..!

Published : Feb 11, 2023, 09:35 AM IST
నిర్మాత సురేష్ బాబు, హీరో రానాలపై పోలీసు కేసు నమోదు.. కోర్టు ఆదేశాలతో..!

సారాంశం

ఫిలింనగర్‌లోని ఓ స్థలం వివాదం కేసులో  ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన కొడుకు హీరో రానాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిలింనగర్‌లోని ఓ స్థలం వివాదం కేసులో  ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన కొడుకు హీరో రానాపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రానా, సురేష్ బాబుతో సహా మరికొందరిపై కేసు  నమోదైంది. ఫిలింనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మకం విషయంలో సురేశ్‌బాబు ఒప్పందం అమలు చేయ డం లేదని బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రమోద్‌ కుమార్‌ పచ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీలతో బెదిరించారని కూడా ఆరోపించారు. 

అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రమోద్ కుమార్.. కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు దగ్గుబాటి సురేష్ బాబు, రానా సహా మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, ఈ కేసు విచారణకు హాజరుకావాలని రానా, సురేష్‌బాబులకు కోర్టు సమన్లు జారీ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చావు దగ్గర పడినట్లు మాట్లాడిన సుమిత్ర
విజయ్ దేవరకొండ డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టా లేనట్టా? రౌడీ హీరో అభిమానులకు కు షాకింగ్ న్యూస్..